కరినగర్ మాధవ సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
మాధవ సేవా సమితి నిర్వహిస్తున్న అనేక సేవాకార్యక్రమాలలో భాగంగా స్థానిక కరినగర్‌లోని గౌతమి నగర్ ఎస్సీ ఎస్టీ బస్తీలో మాధవ సేవా సమితి కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది. జ్యోతినగర్‌లో గల సంగీత హాస్పిటల్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వి.సంగీతా రెడ్డి, నాగేంద్ర పెథాలజీ ల్యాబ్ డా!! రవి పాల్గొని పిల్లల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరానికి 42 మంది పిల్లలు, పెద్దలు వచ్చి పరీక్ష చేయించుకున్నారు. వారికి ఉచితంగా పరీక్షించడం, ఉచితముగా మందుల పంపిణీ చేయడం జరిగినది. చివరిగా పిల్లల ఆరోగ్యం, ఆహార నియమాల గురించి పిల్లల తల్లితండ్రులకు డాక్టర్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సమితి అధ్యక్షులు శ్రీ ఎల్లంకి హనుమంతరావు గారు, సమితి కార్యదర్శి శ్రీ గుర్రాల మహేశ్వర్ రెడ్డి గారు, ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవాహ శ్రీ పాక సత్యనారాయణ గారు, సమితి సభ్యులు శ్రీ కామారపు ప్రసాద్ మొదలగు వారు పాల్గొన్నారు.