కేస్లాపూర్ జాతరలో, మేడారం జాతరలో వనవాసీ కల్యాణ పరిషత్ ఉచిత వైద్య శిబిరం
కేస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా వనవాసీ కల్యాణ పరిషత్ ఆదిలాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఐదు రోజుల పాటు ఈ జాతర జరుగగా, నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ సహకారంతో నాగోబా మందిర ప్రాంగణంలో ఈ వైద్య శిబిరం నిర్వహించారు. జాతర ప్రారంభమైన రోజునే నాగోబా దేవాలయ పీఠాధిపతి వెంకట్రావు పటేల్ చేతుల మీదుగా ఈ ఉచిత వైద్య శిబిరం ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని 1500 మందికి పైగా ప్రజలు వినియోగించుకున్నారు.
ప్రతి సంవత్సరం నాగోబా జాతర సందర్భంగా వనవాసీ కల్యాణ పరిషత్ పక్షాన ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని, ఇందులో నాణ్యమైన మందులు అందిస్తున్నారని, వైద్యులు కూడా అత్యంత శ్రద్ధతో సేవలు చేస్తున్నారని స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక.. వనవాసీ కల్యాణాశ్రమం అఖిల భారతీయ మార్గదర్శకులు సోమయాజులు నాగోబాను దర్శించుకున్నారు. అనంతరం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించారు.

మేడారం జాతరలోనూ…
మేడారం సమ్మక్క సారక్క జాతరలోనూ వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందించారు. 25 మంది డాక్టర్లు, 10 మంది ఫార్మసీ విద్యార్థులు, 20 మంది ప్రబంధకులతో 10 వేల మందికి పైగా ఉచిత వైద్య సేవలు, మందులను అందించారు.

నాలుగు మోబైల్ వాహనాలతో ఈ సేవలు అందించారు. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి, వైద్యులు భక్తులకు సేవలందించారు. కేవలం సేవలుఅందించడమే కాకుండా… ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తితే ఈ వైద్యులే దగ్గరుండే ప్రభుత్వ ఆస్పత్రికి కూడా తీసుకెళ్లి, మెరుగైన వైద్యం కూడా అందించారు.

అఖిల భారతీయ వనవాసీ కల్యాణాశ్రమం మార్గదర్శకులు సోమయాజులు, ప్రాంత అధ్యక్షులు వెంకటయ్య, ప్రాంత సంఘటనా కార్యదర్శి ఆంజనేయులు ఈ ఉద్ఘాటనలో పాల్గొన్నారు. NMO ప్రాంత సంయోజక్ డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైద్యులకు మార్గద్శనం అందింది.