చదువు సంధ్యలతో పాటూ విద్యార్థులకు సేంద్రీయ వ్యవసాయంఫై ఉచిత శిక్షణ
ప్రస్తుత కాలం పిల్లలకు చాలా మందికి ప్రకృతికి సంబంధించిన విషయాలు గానీ, వ్యవసాయానికి సంబంధించిన విషయాలపై కనీస అవగాహన లోపించింది. పట్టణీకరణ, నగరీకరణ బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన ప్రాథమిక విషయాలు కూడా తెలియడం లేదు. దీంతో పంట విలువ గానీ, రైతు కష్టపడుతున్న విలువగానీ తెలియడం లేదు. ఈ నేపథ్యంలో బిహార్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు చదువు సంధ్యలతో పాటు సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగుపై కూడా ఉచితంగా శిక్షణనివ్వాలని నిర్ణయించింది. తోటపని కూడా నేర్పిస్తారు. పాట్నాలోని సుమారు 565 పాఠశాలల్లో క్యాబేజీ, పెసలతో పాటు.. పలు రకాల కూరగాయల సాగు విషయంలో శిక్షణనిస్తారు. సాగు ఎప్పుడు చేయాలి? విత్తనం ఎలా వేయాలి? నీటిని ఎప్పుడు, ఎంత అందించాలి? దిగుబడి అధికంగా ఎలా వస్తుంది? అనే విషయాలపై నిపుణులతో విద్యార్థులకు శిక్షణనిప్పిస్తారు.
అయితే.. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేస్తోంది. సేంద్రీయ వ్యవసాయం చేసేందుకు నీటి వసతి బాగా వున్న ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక కూడా చేశారు. బకెట్లలో, ప్లాస్టిక్ బాటిళ్లలో, కుండీల్లో మొక్కలు పెంచేలా శిక్షణనిచ్చి… వ్యవసాయంపై శిక్షణనిచ్చారు. అలాగే అతి తక్కువ స్థలంలో పండిరచే కూరగాయల జాబితాను కూడా అందిస్తారు. బచ్చలికూర, ముల్లంగి, కొత్తిమీర, మెంతులు, టమోటా, మిరపకాయ, కేరట్, పుదీనా, ఇతర కూరగాయలను పండిరచనున్నారు. వీటితో పాటు సీజనల్ కూరగాయలు, దాని సాగు పద్ధతిపై, సాగునీటి పారుదల గురించి పిల్లలకు నేర్పిస్తారు. ఇలా శిక్షణనిస్తూనే సెమినార్లు కూడా నిర్వహిస్తారు. ఏ సీజన్‌లో ఎలాంటి కూరగాయలు పండిరచాలి, ఏఏ కూరగాయల్లో ఎలాంటి పోషకాలున్నాయో కూడా చెబుతారు.