మహాత్మా గాంధీ హత్య – ఆరెస్సెస్‌: అపోహలు, వాస్తవాలు

మహాత్మాగాంధీ హత్యకు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ును బాధ్యురాలిగా చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ విరోధులు తరచుగా ఆరోపణ చేస్తుంటారు. కానీ వాస్తవాలు చెప్పే అసలైన కథ మాత్రం వేరే ఉంది. అదేంటి?

 1948 జనవరి 30న మహాత్మా గాంధీ హత్య జరిగిన సుమారు అరగంటకు ఢిల్లీలోని తుగ్లక్‌ రోడ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. అందులో నందలాల్‌ మెహతా అనే వ్యక్తి ప్రకటన ఉంది. నందలాల్‌ మెహతా కన్నాట్‌ ప్లేస్‌ నివాసి. గాంధీని కాల్చినప్పుడు ఆయన పక్కన నించుని ఉన్నది మెహతాయే.

పోలీసులకు మెహతా చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘ఆనవాయితీ ప్రకారం మహాత్మా గాంధీ తన చేతులు జోడిరచి ప్రజలకు నమస్కారాలు చెబుతున్నారు. అంతలో ఒక వ్యక్తి దగ్గరకు వచ్చాడు. అతను పుణే నగరానికి చెందిన నారాయణ్‌ వినాయక్‌ గాడ్సే అని నాకు తర్వాత తెలిసింది. ఒక పిస్టల్‌తో మహాత్మా గాంధీ మీద కాల్పులు జరిపాడు. అతను మహాత్ముడికి 2-3 అడుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. అతను గాంధీని పొట్టలోనూ, ఛాతీ మీదా కాల్చాడు. గాంధీజీ శరీరం మీద రక్తం పారింది. గాంధీజీ రామ్‌రామ్‌ అంటూ వెనక్కి పడిపోయారు. దాడి చేసిన వ్యక్తిని ఘటనా స్థలంలోనే ఆయుధంతో సహా పట్టుకున్నారు. స్పృహ తప్పిన మహాత్ముణ్ణి ఆ స్థితిలోనే బిర్లాహౌస్‌ రెసిడెన్షియల్‌ యూనిట్‌కు తీసుకువెళ్ళారు. ఆ దారిలోనే మహాత్ముడు ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడికి పాల్పడిన యువకుణ్ణి పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు..’’

ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యే సమయానికి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మాధవరావు సదాశివ గోళ్వాల్కర్‌ చెన్నైలో (అప్పటి మదరాసు నగరం) ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశంలో పాల్గొంటున్నారు. గాంధీ మరణవార్త విని గాద్గదిక స్వరంతో ‘‘దేశానికి ఇదెంతో దురదృష్టకరం’’ అన్నారు.

అయితే ప్రభుత్వం మాత్రం మరోలా స్పందించింది. 1948 ఫిబ్రవరి 4న ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించింది. గోళ్వాల్కర్‌ను అరెస్ట్‌ చేసారు. దురదృష్టం ఏంటంటే గోళ్వాల్కర్‌ను అరెస్ట్‌ చేయడానికి బెంగాల్‌ స్టేట్‌ ప్రిజనర్స్‌ యాక్ట్‌ అనే చట్టాన్ని ప్రయోగించారు.  గోళ్వాల్కర్‌ను ఆరు నెలల తర్వాత విడుదల చేసారు, కానీ మరికొన్నాళ్ళకే మళ్ళీ అరెస్ట్‌ చేసారు. దాంతో ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయంసేవకులు సత్యాగ్రహం చేసారు. 77వేలమందికి పైగా స్వయంసేవకులు అరెస్ట్‌ అయ్యారు. అయినప్పటికీ ఆనాటి ప్రభుత్వం సంఘానికి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యమైనా చూపలేక పోయింది.

1966లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం, గాంధీ హత్య కేసును క్షుణ్ణంగా అధ్యయనం చేయాలంటూ కొత్త జ్యుడీషియల్‌ కమిషన్‌ను నియమించింది. విశ్రాంత సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ జెఎల్‌ కపూర్‌ ఆ కమిషన్‌ నాయకుడు. ఆ కమిషన్‌ మొత్తం 101 మంది సాక్షులను, 407 పత్రాలనూ పరీక్షించింది. కమిషన్‌ ఎట్టకేలకు 1969లో తమ నివేదికను ప్రచురించింది. అందులో ముఖ్యాంశాలు.

(అ) నిందితుడు ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యుడని కానీ లేదా దాని సభ్యులతో సంబంధం ఉందని, లేదా ఆ హత్యలో ఆ సంస్థకు ప్రమేయం ఉందనీ నిరూపణ అవలేదు.

(ఆ) మహాత్మా గాంధీ, లేదా ఇతర ప్రధాన కాంగ్రెస్‌ నాయకులకు వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ హింసాయుత కార్యక్రమాలకు పాల్పడిరదనడానికి ఆధారాలు లేవు

(ఇ) నిందితుడు ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులని లేదా నేతల హత్యల వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రమేయం ఉందనీ నిరూపణ కాలేదు.

అయినా నేటికీ చాలామందికిగాంధీ హత్యను సంఘానికి ముడిపెడుతూ వ్యాఖ్యలు చేయడం, కోర్టుల్లో మొట్టికాయలు వేయించుకోవడం అలవాటైపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *