థాయిలాండ్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు

థాయ్ లాండ్ లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు జరిగాయి. వినాయక చవితి సందర్భంగా అక్కడి హిందువులు సాంస్కృతిక ప్రదర్శనలు, భక్తి సంగీత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా అక్కడి సమాజంలో ఐక్యత మరియు సద్భావన విలువలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. రెండు రోజుల పాటు ఈ వేడుకలు జరుగగా, పర్యావరణ అనుకూల గణేష్ మూర్తిని ప్రతిష్ఠించారు. అక్కడి వారు గణేషుడ్ని ఫ్రాపై కానెట్ అని పిలుస్తారు. పట్టాయా  మేయర్, హెడ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (DM) మరియు పట్టాయా సిటీ కౌన్సిల్స్ ఇతర సభ్యుల సమక్షంలో వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అధికారులు ఎంతో సహకరించారు.స్థానిక కళాకారులు మరియు కోల్‌కతాకు చెందిన ఒక ప్రొఫెషనల్ బృందం ప్రదర్శించిన భారతీయ శాస్త్రీయ నృత్యాలు మరియు భజనలు (భక్తి పాటలు) సహా సాంప్రదాయ సంగీతం మరియు నృత్య ప్రదర్శనలను నిర్వహించారు. మరోవైపు గణేష్ ఉత్సవాల విశిష్టత, హిందూ సంప్రదాయాలపై సమ్మేళనాలను కూడా నిర్వహించారు. చివరి రోజు అక్కడి హిందువులందరూ అద్భుతమైన రథంపై… వినాయకుడ్ని ఊరేగిస్తూ… నిమజ్జనం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *