గంగపాయల కూర
ఇది చూడటానికి ఎర్రని కాడలతో గలిజేరుని పోలి ఉంటుంది. నేలమీద పాకుతుంది. కాడలు, ఆకులు మందంగా ఉంటాయి. ఇది పసుపుపచ్చని పూలు పూస్తుంది.దీని రుచి పుల్లగా ఉంటుంది.
– ఇది పాలు, వెన్నకంటే మంచిది .
– దీనిలో ,దీ విటమినులు బాగా ఉన్నాయి. పాలకంటే, వెన్నకంటే కూడా జీవశక్తి అధికంగా ఉన్నది అని తమిళనాడు ప్రభుత్వ పరిశోధనలో తేలింది. అదేవిధంగా రోగనిరోధక శక్తి బాగా పెంచుతుందని కూడా పరిశోధనలో తెలిసింది.
– ఈ కూరలో ఐరన్, కాల్షియం ఎక్కువుగా ఉన్నాయి. విటమిన్ ఎక్కువ, దీ , ణ విటమినులు కొద్దిగా ఉన్నాయి.
– రక్తహీనతకు మంచి ఫలితాలు ఉంటాయి. రక్తం కక్కుకునే వ్యాధికి మంచి ఔషధం.
– శరీరంలో దుష్ట పదార్థాలను తొలిగించి బయటకి పంపడంలో దీనిని మించింది లేదు .
– మన శరీర ఆరోగ్యానికి ‘‘క్షారశిల’’ అను మూల పదార్థం అవసరం. ఈ పదార్థం గంగ పాయల కూరలో పుష్కలంగా ఉంటుంది. ఎముకలు, దంతాల పెరుగుదలకు అది అత్యంత అవసరం.
– సంగ్రహణి, కుష్టు, మూత్రాశయంలో రాళ్ళు వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ కూరని ఆహారంలో బాగం చేసుకోవాలి .
– వెంట్రుకలకు బలాన్ని ఇస్తుంది.
గమనిక –
ఈ ఆకుకూరని పారేనీటిలో కడగడం ఉత్తమమైన పని. ఇది నేల మీద పాకుతుంది కాబట్టి ఇసుక , మట్టి ఎక్కువుగా ఉంటాయి. జాగ్రత్తగా శుభ్రపరుచుకోవాలి
దీనిని మరీ అతిగా తినరాదు. ఎందుకంటే ఇది చలువచేసే గుణం కలిగినది. ఎక్కువ తింటే శరీరంలో శ్లేష్మం పెరుగుతుంది. కండ్లు, మూత్ర పిండాలు, తలలో నరాలపై కొంచం ప్రభావం చూపిస్తుంది. కాబట్టి10 రోజులకు ఒకసారి తింటే చాలు.
– ఉషాలావణ్య పప్పు