ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులను మరింత పెంచాలి : వెంకయ్య నాయుడు
సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యం తో గ్రామ భారతి వారు ఏర్పాటు చేసిన ఎక్స్పో ను ప్రారంభించడం అందంగా వుందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అన్నదాతలను, వినియోగదారులను ననుసంధానం చేయడానికి ఇలాంటి మేళాలు ఉపయోగపడతాయని అన్నారు. భారత దేశం వ్యవసాయ రంగ వృద్ధికి ఎంతో అనుకూలమని, ఇక్కడి వాతావరణం, నేలలు అనుకూలమని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులను మరింత పెంచడానికి, మార్కెట్ అనుసంధానానికి మరెన్నో పరిశోధనలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ప్రైవేటు సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ రంగం లో పెట్టుబడులు పెట్టాలి, అన్నదాతలకు అండగా నిలబడాలని సూచించారు.
గ్రామభారతి కిసాన్ ఎక్స్‌పో-2024, 2వ ఎడిషన్ హైదరాబాద్ లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మార్చి 16 తేదీ భారత పూర్వపు ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతునేస్తం వ్యవస్తాపకుడు శ్రీ వెంకటేశ్వరరావు గారు, సహస్ర గ్రూప్ చైర్మన్, నాబార్డు ప్రతినిధులు, FTCCI ప్రతినిధులు, గ్రామభారతి ఛైర్ పర్సన్ శ్రీమతి సామసునీత, KISAN EXPO సమన్వయకర్త శ్రీ కరుణ్ రెడ్డి గారు, FPO డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి, శ్రీమతి రమ్య, శ్రీమతి హేమలత గారు మరియు FPO సభ్యులు పాల్గొన్నారు.
ఈ నెల 16 & 17 తేదీలలో రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో వినియోగదారులు-ప్రకృతిరైతుల అనుసంధానం అన్న నినాదంతో జరగిన ఈ ప్రదర్శనలో 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. తెలంగాణ & ఇతర రాష్ట్రాల నుంచి వ్యవసాయ వ్యాపార సంస్థలు, యంత్ర పరికరాల కంపెనీలు, ప్రకృతి వ్యవసాయ రైతులు వారి వారి ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు, సరికొత్త సాంకేతిక యంత్రికరణ పరిజ్ఞాన ఆవిష్కరణలు, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలైన ఉద్యానవన, డైరీ & పౌల్ట్రీ రంగాల ఉత్పత్తులకు విలువల జోడింపు విధానాలను ప్రదర్శించడం జరుగింది. ఈ సందర్భంగా జాతీయస్థాయి ప్రముఖ వక్తలు ప్రకృతివనం ప్రసాద్ గారు, SAVE విజయ్ రామ్ గారు, సాక్షి రాంబాబు గారు, రైతుబడి రాజేందర్ రెడ్డి గారు, మిద్దెతోట రఘోత్తం రెడ్డి గారు, పర్మాకల్చర్ విధానాల గురించి శ్రీమతి పద్మ నరసన్న కొప్పుల గారు, CSA రామాంజనేయులు గారు, ZBP మాధవరెడ్డి గారు, శాస్త్రవేత్తలు వారి వ్యవసాయ విధానాలను మార్కెటింగ్ అవకాశాల అనుభవాన్ని KISAN EXPO-2024 వేదికగా పంచుకున్నారు.