దేశవ్యాప్తంగా ‘గతివిధుల’ కార్యం

సామాజిక మార్పు కోసం చేపట్టిన గతివిధులకు సంబంధించిన నివేదిక ` ధర్మ జాగరణ సమన్వయ్‌
2023 జనవరి 25 నుండి 30 వరకు మహారాష్ట్రలోని జల్గావ్‌ జిల్లాలోని గోద్రిలో అఖిల భారత హిందూ గోర్‌ బంజారా, లబానా నాయకడ సమాజం కుంభమేళ జరిగింది. 9 లక్షల మంది వచ్చారు. మతమార్పిడులకు వ్యతిరేకంగా కేంద్ర చట్టం, బంజారా హిందువులు అనే అంశంపై తీర్మానాలు ఆమోదించారు.

గో సేవ :
గ్రామ స్థాయి నుండి విభాగ్‌ స్థాయి వరకు 25,960 మంది కార్యకర్తలు గోసేవలో నిమగ్న మయ్యారు. ఈ ఏడాది జరిగిన 1009 శిక్షణ శిబిరాల్లో 23,343 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక జాతికి చెందిన 215,825 ఆవులను 79,993 కుటుంబాలు పెంచుతున్నాయి. 11,058 ఇళ్లలో గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్‌ను అమర్చారు. 2457 కుటుంబాలు 42,237 ఎకరాల్లో గో ఆధారిత వ్యవసాయం సాగు చేస్తు న్నారు. 7657 గోశాలలను కార్యకర్తలు నిర్వహిస్తు న్నారు. దీపావళి సందర్భంగా ఆవు పేడతో తయారు చేసిన దీపాల ఉత్పత్తి 5 లక్షలు దాటింది. 1,19,461 మంది విద్యార్థులు గో విజ్ఞాన్‌ నిర్వహిం చిన పరీక్షలో పాల్గొన్నారు. గోకథ కార్యక్రమాల్లో 119461 మంది హాజరయ్యారు.

గ్రామ వికాస్‌ :
అక్షయ కృషి పరివార్‌ అఖిల భారతీయ ప్రశిక్షణ సౌరాష్ట్ర ప్రాంతంలోని భుజ్‌లో జరిగింది. దేవగిరి ప్రాంతంలో గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగింది. కర్ణాటక రాష్ట్రంలో దట్టమైన చెట్ల పెంపకం గణనీయంగా పెరిగింది. గ్రెయిన్స్‌ ఫర్‌ బర్డ్స్‌ వంటి కార్యక్రమాలు సౌరాష్ట్ర ప్రాంతంలో కటాడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల ద్వారా గ్రామ కమిటీ నిర్వహిస్తుంది.

కేరళలోని ఇరింజలకుడ జిల్లా తిరువల్లూరు గ్రామానికి చెందిన స్వయం సేవకులు గ్రామంలో మద్యం, అప్పులు, రోగాలు, నేరాలు, సంఘర్షణల రహిత గ్రామం తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. చిత్తోడ్‌లోని జల్వాడలో తిరువళ్లూరు గ్రామంలో గురాడి వ్యవసాయ శాఖ గ్రామాన్ని స్వావలంబనగా మార్చాలనే ఉద్దేశ్యంతో 7 స్వయం సహాయక బృందాలను నడపడంలో కీలకపాత్ర పోషిస్తోంది.

పర్యవరణ సంరక్షణ్‌ :
సముద్ర జలాల పరిశుభ్రత కోసం 10570 ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యంతో దేశంలోని 75000 కి.మీ తీరప్రాంతంలో 836 ప్రదేశాల నుండి 738 టన్నుల పాలిథిన్‌ వ్యర్థ పదార్థాలు తొలగించారు. సీమా జాగరణ్‌ మంచ్‌, భూ విజ్ఞాన మంత్రిత్వతో పాటు NSS, SFD ఇతర సంస్థలు పాల్గొన్నాయి. మొత్తం 1,37,396 మంది పాల్గొన్నారు. పశ్చిమ్‌ మహారాష్ట్రలో నవరాత్రుల సందర్భంగా సాంగ్లీ నగరం, చుట్టుపక్కల గ్రామాలలో పాత చీరలతో తయారు చేసిన మొత్తం 4000 సంచులు పంపిణీ చేశారు.

మాల్వాప్రాంతంలో ఉజ్జయిని మహానగర్‌కు చెందిన స్వయంసేవకులు ‘క్షిప్రా నది సంరక్షణ’ పేరుతో నదిలోకి కలుషిత నీరు చేరకుండా నిరోధించడంతోపాటు నది పరివాహక ప్రాంతంలో చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. నదిలో కలుస్తున్న ఉపనదులను కూడా శుభ్రం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *