గోరఖ్‌ ‌పూర్‌ ‌గీతాప్రెస్‌కు ‘‘గాంధీ శాంతి బహుమతి’’

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరానికిగాను గాంధీ శాంతి అవార్డును గోరఖ్‌ ‌పూర్‌లోని గీతా ప్రెస్‌కి ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. అహింసా, ఇతర గాంధేయ పద్ధ తుల ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్త నకు గీతా ప్రెస్‌ అం‌దించిన విశిష్ట సహకారాన్ని గుర్తించి ఈ  అవార్డును ప్రకటించినట్టు మంత్రిత్వ శాఖ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది.

జూన్‌ 18‌న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని జ్యూరీ, చర్చల తర్వాత సామాజిక రంగానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా, 2021 సంవత్సరానికి గాంధి శాంతి బహుమతి గ్రహీతగా గీతా ప్రెస్‌, ‌గోరఖ్‌పూర్‌ను ఎంపిక చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. గీతా ప్రెస్‌ అసమానమైన సహకారాన్ని కూడా జ్యూరీ గుర్తించింది. గీతా ప్రెస్‌ ‌మానవాళి  సామూహిక ఉద్ధరణకు దోహదపడింది, ఇది నిజమైన గాంధేయ జీవనాన్ని ప్రతిబింబిస్తుందని జ్యూరి అభిప్రాయ పడింది. సంస్థ తన ప్రచురణలలోని ప్రకటనలపై, ఆదాయ ఉత్పత్తి కోసం ఎన్నడూ ఆధారపడలేదు. గీతా ప్రెస్‌ ‌దాని అనుబంధ సంస్థలతో పాటు, జీవిత అభివృద్ధికి,  అందరి శ్రేయస్సు కోసం కృషి చేస్తోంది.

శాంతి, సామాజిక సామరస్యానికి సంబంధిం చిన గాంధేయ ఆదర్శాలను ప్రచారం చేయడంలో గీతా ప్రెస్‌ అం‌దించిన సహకారాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. గీతా ప్రెస్‌ ‌స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా గాంధీ శాంతి బహుమతిని అందించడం ఆ సంస్థ సమాజసేవలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆయన పేర్కొన్నారు.

వంద సంవత్సరాల క్రితం 1923లో దయాళ్‌ ‌గోయంకా, ఘనశ్యామ్‌ ‌దాస్‌ ‌జలాన్‌లు గీతా ప్రెస్‌ను స్థాపించారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రచురణకర్తలలో ఒకటి, హిందూ మత గ్రంథాల ప్రపంచంలోనే అతిపెద్ద ప్రచురణసంస్థ, శ్రీమద్‌ ‌భగవద్గీత  16.21 కోట్ల కాపీలతో సహా 14 వేర్వేరు భాషలలో 41.7 కోట్ల పుస్తకాలను ప్రచురించింది. ఇది సనాతన ధర్మ సూత్రాలను ప్రచారం చేయడం కోసం ఏర్పాటు చేసిన సంస్థ.

గీతా ప్రెస్‌ ఇప్పుడు శ్రీమద్‌ ‌భగవద్గీత, మహాభారతం, రామాయణం, రామచరిత్మానాలు, పురాణాలు, ఉపనిషత్తుల వంటి వివిధ హిందూ గ్రంథాలు, హిందూ మతానికి సంబంధించిన ఇతర పుస్తకాలు, భజనలు, భక్త-గాథలు మరియు ఇతర పుస్తకాలను ప్రచురిస్తోంది. సంస్కృతం, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్‌, ‌కన్నడ, తమిళం, తెలుగు, గుజరాతీ, బెంగాలీ, ఒరియా ఇతర భారతీయ భాషలతో సహా పలు భాషల్లో గ్రంథాలు ప్రచు రించారు.

ప్రధాని మోదీ ప్రశంసలు

గాంధీ శాంతి బహుమతికి ఎంపికైనందుకు గీతా ప్రెస్‌ని ప్రధాని మోదీ అభినందించారు. ‘‘ప్రజలలో సామాజిక, సాంస్కృతిక పరివర్తనలను పెంపొందించడానికి గీతాప్రెస్‌ ‌గత 100 సంవత్సరాలుగా ప్రశంసనీయమైన పని చేసారు’’ అని ఆయన ట్విట్టర్‌లో రాశారు.

గాంధీ శాంతి బహుమతి

మహాత్మా గాంధీ 125వ జయంతి సందర్భంగా 1995లో భారత ప్రభుత్వం గాంధీ శాంతి బహుమతి అనే వార్షిక పురస్కారాన్ని ప్రారంభిం చింది. ఈ అవార్డులో రూ.1 కోటి, ప్రశంసా పత్రం, ఫలకం, సాంప్రదాయ హస్తకళ లేదా చేనేత వస్తువు అందజేస్తారు.

గతంలో ఇస్రో, రామకృష్ణ మిషన్‌, ‌గ్రామీణ బ్యాంక్‌ ఆఫ్‌ ‌బంగ్లాదేశ్‌, అక్షయ పాత్ర వంటి సంస్థలు  అవార్డు పొందాయి. అలాగే దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు దివంగత డాక్టర్‌ ‌నెల్సన్‌ ‌మండేలా, డాక్టర్‌ ‌జూలియస్‌ ‌నైరెరే, జపాన్‌లోని శ్రీ యోహెయ్‌ ‌ససకవా వంటి ప్రముఖులకు కూడా దీనిని ప్రదానం చేశారు.

ఈ అవార్డుకు జాతీయత, జాతి, భాష, కులం, మతం లేదా లింగంతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇటీవలి అవార్డు గ్రహీతలలో సుల్తాన్‌ ‌ఖబూస్‌ ‌బిన్‌ ‌సైద్‌ అల్‌ ‌సైద్‌, ఒమన్‌ (2019), ‌బంగ్లాదేశ్‌లోని బంగబంధు షేక్‌ ‌ముజిబుర్‌ ‌రెహ్మాన్‌ (2020) ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *