పల్లెల్లోనూ జనరిక్ మందుల దుకాణాలు… మహిళా సంఘాల పాత్రే కీలకం

పేద ప్రజలకు అత్యంత చవకగా ఔషధాలను అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అతి తక్కువ ధరలకే ఔషధాలను పేదలకు ఏకైక లక్ష్యంతో గ్రామాలు, పల్లెల్లోనూ జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే పల్లెల్లో ఇక నుంచి జనరిక్ దుకాణాలనే ప్రోత్సహించాలని నిర్ణయించింది. అయితే.. మహిళా సంఘాల ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సంగారెడ్డి ప్రాంతంలో మరింత బలోపేతంగా, ప్రాజెక్ట్ గా చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా జనరిక్ మందుల దుకాణాలకు స్త్రీనిధి రుణాలను కూడా ప్రభుత్వం అందిస్తోంది. జిల్లా యంత్రాంగం కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది.

గ్రామీణ ప్రాంత ప్రజలకు జనరిక్ దుకాణాలను మరింత చేరువ చేయాలని ముందుకు సాగుతోంది. మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించడానికి ముందుకు రావడంతో ఇది మరింత సుగుమమైంది. మహిళా సంఘాల సభ్యుల్లో అర్హత సాధించిన వారికి దుకాణాల ఏర్పాటుకు రుణాలు కూడా ఇవ్వాలని ప్లాన్ చేశారు. ఒక్కో జనరిక్ మందుల దుకాణానికి మూడు నుంచి లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వనుంది ప్రభుత్వం.

మిగిలిన జిల్లాల్లో కూడా జనరిక్ మందుల దుకాణాలను బాగా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఆయా జిల్లాల్లోని మహిళా సంఘాలను ఇప్పటికే సంప్రదిస్తోంది. ఎలా మంజూరు చేస్తారు? ఏమేమి కావాలి అన్న దానిని వారికి బాగా అర్థమయ్యేలా చేస్తోంది. ఆయా మహిళా సంఘాల బంధువులు గానీ, ఇళ్లల్లో గానీ ఎవరైనా బీ ఫార్మసీ చేసిన వారు వుంటే ఇది మరింత సులువు అవుతుందని తెలిపారు.

అయితే… ప్రభుత్వం జనరిక్ మందుల దుకాణాలను మంజూరు చేయడానికి కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేసింది.

స్వయం సహాయ సంఘాల్లో కచ్చితంగా సభ్యులై వుండాలి. వారి కుటుంబం, దగ్గరి బంధువుల్లో ఎవరైనా డీఫార్మసీ, బీ ఫార్మసీ, ఎంఫార్మసీ విద్యార్హత కచ్చితంగా వుండాలి.

రుణం పొందడానికి సభ్యురాలి సంఘం తీర్మానం తప్పనిసరిగా చేసి వుండాలన్న నిబంధన

ఈ దుకాణం కోసం డ్రగ్ ఇన్ స్పెక్టర్ ధ్రువీకరణ పత్రం కచ్చితంగా కావాలి. వారి విద్యార్హత, కొటేషన్, సరైన పత్రాలతో పాటు స్త్రీనిధి అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. వారివి అన్ని సరిగ్గా వుంటే సంబంధిత వెబ్ సైట్ లో నమోదు చేస్తారు.

చివరగా ప్రతి నెల నెలా వాయిదాల రూపంలో ఐదు సంవత్సరాల లోపు రుణం మొత్తం తిరిగి చెల్లించాలి.

ఈ నిబంధనలకు అనుగుణంగా పల్లెల్లో, గ్రామ స్థాయిలో జనరిక్ మందుల షాపులన సంఖ్య మరింత పెంచాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. దానికి అనుగుణంగా మహిళా సంఘాలు కూడా ముందుకు వస్తున్నాయని అధికారులు వివరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *