ఇవ్వడం అలవరుచుకోవాలి
సమర్థరామదాసు ఒక ఊళ్ళో కేవలం ఐదు ఇళ్ళ నుండి మాత్రమే భిక్ష స్వీకరించేవారు. ఒక గ్రామంలో వృద్ధమహిళ ఒంటరిగా ఉండేది. ధనికురా లైనా ఆమె ఎవరికీ ఏ దానం చేయదని అంతా చెప్పారు.
ఆమెకు దానగుణం నేర్పడం కోసం సమర్థ రామదాసు ఆ ఇంటికే వెళ్ళారు. ‘భవతి భిక్షాందేహి’ అని భిక్ష కోసం అడిగారు. వృద్ధురాలు బయటకై నా రాకుండా లోపల నుంచే నా దగ్గర ఏమీ లేదు, నేను ఏమీ ఇవ్వను అని గట్టిగా అరిచింది. అయినా సమర్థరామదాసు తన ప్రయత్నం విరమించలేదు. భిక్ష ఇవ్వమని అడుగుతూనే ఉన్నారు. దాంతో కోపగించిన ఆ మహిళ పిడికెడు మట్టితెచ్చి ఆయన జోలిలో వేసింది. రామదాసు ఆమెను ఆశీర్వదించి వెళిపోయారు. అలా నాలుగురోజులు అయిదవరోజన ఆ వృద్ధమహిళ ‘నేను నాలుగురోజులుగా మట్టి వేస్తున్నా మీరు అదే తీసుకువెళుతున్నారు. నేను ఇలా చేస్తున్నందుకు మీకు కోపం రావడం లేదా’ అని అడిగింది. అందుకు గడిచాయి.
సమర్థరామదాసు ‘అమ్మా! మీ దగ్గర ఇవ్వడానికి చాలా ఉంది. కానీ ఇవ్వాలనే ఆలోచన, స్వభావం లేవు. కనీసం మట్టి అయినా సరే, ఇచ్చే అలవాటు మీకు చేయాలన్నదే నా ఆలోచన. అలా ఇవ్వడం అలవాటైతే మీరు ఏమైనా ఇవ్వగలరు’ అని సమాధానం ఇచ్చారు.