గీతాజయంతి

 (డిసెంబర్‌ 3 ‌గీతాజయంతి సందర్భముగా)

పరమపావనమైన మార్గశీర్ష శుక్ల ఏకాదశి, భగవద్గీత లోకానికి అందిన రోజు. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి అనుగ్రహించినటువంటి మహోపదేశం. అర్జునుడికే కాదు, కర్తవ్య నిర్వహణలో ఎదురయ్యే సమస్యలకి సందిగ్ధతకి సమాధానంగా భగవద్గీత ఈనాటికీ ప్రమాణంగా నిలుస్తుంది, ఏనాటికీ ప్రమాణంగా నిలుస్తుంది.

‘‘ఏశ్రేయస్యం నిశ్చితం భూహితన్మే’’ నేను శ్రేయస్సుని కోరుకుంటున్నాను, నాకేది శ్రేయస్సో అదిచెప్పు అని అర్జునుడు అడిగాడు. శ్రేయస్సుని పొందాలి అనుకున్నవాడికే ఏమైనా చెప్పడం అవసరం, ఆ శ్రేయస్సు కోరే వ్యక్తి ఏస్థాయిలో ఉన్నా అందరికి అందేలా శ్రీకృష్ణ భగవానుడు అందించిన ఉపదేశమే భగవద్గీత. గాలి ఎంత సనాతనమో, జలం ఎంత సనాతనమో, ఆకాశం ఎంత సనాతనమో శ్రీమద్భగవద్గీత మానవ జాతికి నిత్య నూతనమై వెలుగొందే మహోపదేశం. ఈనాడు భగవద్గీత లోకానికి అందిన రోజు. అయితే శ్రీకృష్ణుడు ఉపదేశం చేసింది యుద్ధ ఆరంభంలో.  యుద్ధం చేయాలా మానాల అని చేయాల్సినవి తగనివి అని అనిపించాయి, చేయకూడనివి తగినవి అని అనిపించాయి. అది చాలా ప్రమాధకరం. చేయాల్సినవి చేయకపోయినా అంత ప్రమాదం లేదు, కానీ చేయకూడనివి చేస్తేనే ప్రమాదం. ఆ రకమైన పార్థుణ్ణి ఉద్దేశించి ఉపదేశం చేసాడు ఆనాడు. అర్జునుడికి కర్తవ్యం తెలిసింది, ‘‘కరిశ్యేవచనంతవా’’, నీవు చెప్పినట్లే చేస్తాను. నా సంశయాలు అన్నీ తీరినవి అని యుద్ధానికి  ఉపక్ర మించాడు. పర్యవసానంగా శ్రీకృష్ణుడి ద్వారా విజయం లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *