ఛత్తీస్‌గఢ్‌లో సనాతన ధర్మంలోకి తిరిగివచ్చిన 240 కుటుంబాలు

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లాలో జరిగిన ఘర్ వాపసీ కార్యక్రమంలో వందలాది మంది తిరిగి సనాతన మతంలోకి చేరారు. రాయ్‌పూర్‌లోని గుడియారి ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది, అక్కడ 240 కుటుంబాలకు చెందిన సుమారు 500 మంది ప్రజలు వేద మంత్రాలు, జపాల మధ్య తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించారు.
అక్కడ ఉన్న దహి హండి మైదానంలో ఈ వేడుక నిర్వహించబడింది. అఖిల భారతీయ ఘర్ వాపసీ ప్రముఖ్, ప్రబల్ ప్రతాప్ జుదేవ్ నేతృత్వంలో, తిరిగి వచ్చిన వారి పాదాలను కడిగి, సనాతన ప్రవాహంలోకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన సంత్ స్వామి నరేంద్రచార్య మహారాజ్ మరియు ఇతరులు కూడా హాజరయ్యారు. వారు చెప్పినదాని ప్రకారం, సనాతన ధర్మానికి తిరిగి వచ్చిన వారిలో చాలామంది ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి , అనారోగ్యాల నుండి నయం కావడానికి క్రైస్తవ మతాన్ని స్వీకరించారని చెప్పారు. అయితే, కాలక్రమేణా వారి ఆరోగ్య సంబంధిత సమస్యలు మెరుగుపడకపోవడంతో కుటుంబాలు తమ అసలు ధర్మంలోకి తిరిగి కలవాలని నిర్ణయించుకున్నాయి.
ఈ సందర్భంగా హాజరైన వారిని ఉద్దేశించి ప్రబల్ జుదేవ్ మాట్లాడుతూ, సనాతన ధర్మం అనేది కేవలం ఒక మతం కాదని, సత్యం, ప్రేమ, సామరస్యం అనే మార్గంలో నడిపించే అద్భుతమైన జీవన విధానం అని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో జుదేవ్ బాబా కార్తీక్ ఒరాన్‌కు నివాళులు అర్పించారు, జంజాతి సమాజ సంస్కృతిని కాపాడటానికి ,వారి హక్కుల కోసం పోరాడటానికి బాబా కార్తీక్ ఒరాన్ తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు.
ఇటీవలే, అక్టోబర్ 30న ఛత్తీస్‌గఢ్‌లోని సారంగర్‌లో జరిగిన ఇలాంటి కార్యక్రమంలో వందలాది మంది సనాతన మతంలోకి తిరిగి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ‘విరాట్ హిందూ సమ్మేళనం’ (సమావేశం)లో భాగంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మం , సంస్కృతి ప్రాధాన్యతను చెప్పడానికి అనేకమంది సాధువులు , ధర్మ జాగరణ్ సభ్యులు పాల్గొన్నారు. ఇక అంతకుముదు దర్రాభటలోని హార్ది హవాయి పట్టి సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 140 మంది వరకు సనాతన మతంలోకి తిరిగి వచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *