ఒడిశాలో ‘‘ఘర్ వాపసీ’’.. 14 మంది తిరిగి హిందూ ధర్మంలోకి
ఒడిశాలో 14 మంది గిరిజనులు తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించాయి. ఒడిశాలో ని పుల్ఘర్ ప్రాంతంలో జరిగింది. మొత్తం 14 మంది వ్యక్తులు, నాలుగు కుటుంబాలకు చెందిన వారు. ముండా, భూయాన్ వనవాసీ కుటుంబాలకు చెందిన వారు గతంలో క్రైస్తవ మిషనరీలు, పాస్టర్ల ప్రలోభాలకు లొంగి, క్రైస్తవంలోకి వెళ్లిపోయారు.అయితే… క్రైస్తవంలో జరుగుతున్న తప్పులు, క్రైస్తవ ప్రబోధకులు చేసిన తప్పులు, చేస్తున్న ప్రలోభాలను తాము గ్రహించామని, తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేయాలని తామంతా నిర్ణయించుకున్నామని ప్రకటించారు. అయితే.. వారిని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకువచ్చే పనిని స్థానికంగా వుండే హిందూ జాగరణ్ మంచ్ స్వీకరించింది. అక్కడి ఆధ్యాత్మిక గురువు సంత్ హరి బాబా నాయకత్వంలో ఈ ఘర్ వాపసీ జరిగింది. ఈ సందర్భంగా 14 మంది వనవాసీలు తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేశారు.
ఈ ఘర్ వాపసీలో భాగంగా వందలాది మంది గ్రామస్థులు కలశ యాత్రతో వారిని ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా సంప్రదాయ అర్చనలతో పాటు హోమ కార్యక్రమాలు కూడా జరిగాయి. అలాగే పురుషులు కూడా తగిన సంప్రదాయ పద్ధతులను పాటించి, పవిత్ర స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించి, పూజాది కార్యక్రమాలు చేసి, హిందూ ధర్మాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా ఘర్ వాపసీ కార్యక్రమ నిర్వహకుడు భరత్ కుమార్ మహంత మాట్లాడుతూ.. మిషనరీల ప్రలోభాలు, కొన్ని కార్యక్రమాల వల్ల కొంత కాలం క్రితం వనవాసీలు క్రైస్తవాన్ని స్వీకరించారని, కానీ… ఇప్పుడు తప్పు తెలుసుకొని, తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారన్నారు.వారే తమల్ని స్వచ్ఛందంగా సంప్రదించారని, వారు హిందూ ధర్మంలోకి తిరిగి రావడాన్ని తాము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు.