కలలో ఆంజనేయుడు: క్రైస్తవం వీడి, హిందూమతంలోకి

 కర్ణాటకరాష్ట్రంలోని యాద్గిర్‌లో క్రైస్తవ మతంలోకి మారిన ఒక కుటుంబం ఇప్పుడు హిందూ ధర్మంలోకి మారిన సంఘటన జరిగింది. గిరినగర్ కాలనీలోని బుద్ధ జంగం సమాజ్ సభ్యుడు వెంకటేష్ తన కుటుంబంతో సహా క్రైస్తవ మతంలోకి మారారు. అయితే ఇప్పుడు వారు తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు. దీనికి ఏంటీ కారణం అనుకుంటున్నారా..? ఆంజనేయుడు కలలో కనిపించడమే..వెంకటేష్ కు కలలో ఆంజనేయయుడు కనిపించి హిందూ ధర్మంలోకి తిరిగి రావాలని చెప్పాడట. అందుకే తాను తిరిగి హిందుత్వాన్ని స్వీకరించానని చెప్పాడు.
వెంకటేష్ కొన్ని సంవత్సరాల క్రితమే వివిధ కారణాల వ్లల భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి క్రైస్తవాన్ని స్వీకరించాడు. అప్పటి నుంచి అతనికి మరిన్ని సమస్యలు మొదలయ్యాయి. ఆర్థికంగా, అనారోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. మన:శ్శాంతి లేకుండా పోయింది. దీనికోసం విచారిస్తున్న సమయంలోనే వెంకటేష్ కు కలలో ఆంజనేయ స్వామి కనిపించడం, అతన్ని హిందుత్వాన్ని తీసుకోమనడంతో అతను తిరిగి హిందుత్వాన్ని స్వీకరించాడు. ఇప్పుడు మానసికంగా ప్రశాంతంగా అనిపిస్తుందని అతను పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *