లక్నోలో 12 తిరిగి హిందూ ధర్మంలోకి
లక్నోలో ఘర్ వాపసీ జరిగింది. 12 మంది ముస్లింలు తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు. వారికున్న ఇస్లామిక్ పేర్లను కూడా విడిచేసి, హిందూ పేర్లను పెట్టుకున్నారు. తమలో కొందరం లవ్ జిహాద్ బాధితులమని, దానిలో ఇరుక్కొని, ఇస్లాంలోకి వెళ్లామని తెలిపారు. మరి కొందరు తమకు ఉద్యోగాలు, డబ్బులు ఇస్తామని చెప్పి, ఆకర్షించారన్నారు.అయితే వారు చేస్తున్న ప్రలోభాలను తాము గ్రహించామని, హిందూ ధర్మం గొప్పతనాన్ని తెలుసుకున్నామని పేర్కొన్నారు. వెంటనే తాము హిందూ ధర్మ సంస్థలను సంప్రదించామని, వారు అత్యంత సంతోషంగా తమను తిరిగి హిందూ ధర్మంలోకి స్వాగతించారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వీరు మొదట సంప్రదాయం ప్రకారం శుద్ధి కర్మలు చేసి, తర్వాత కాషాయ రంగు వస్త్రాలు ధరించి త్రిపుండ్రాలు ధరించారు. ఆ తర్వాత సంప్రదాయ పూజల తర్వాత వారు హిందూ ధర్మంలోకి వచ్చారు.