దేశీ గోమూత్రం ఫై పేటెంట్ భారత్ దే… బాగా కృషి చేసిన ”గో విజ్ఞాన్ అనుసంధాన కేంద్రం”

మన భారత దేశ ఆధారభూతమైన విషయాలపై చాలా మంది పేటెంట్‌ హక్కులు పొందాలని సర్వధా ప్రయత్నాలు చేస్తుంటారు. భారతీయులు బాగా ఆరాధించే వేప చెట్టుపై విదేశీయులు పేటెంట్‌ పొందారు. ఇలా మిగితా వాటిపై కూడా హక్కులు పొందాలని కుట్రలు చేస్తున్నారు. దీనిని గమనించిన నాగపూర్‌ పట్టణానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో వున్న దేవలాపూర్‌ గ్రామంలో స్థాపించిన ‘గో విజ్ఞాన అనుసంధాన కేంద్రం’’ వారు మన దేశంలోని నాటు ఆవు జాతులను సంరక్షిస్తూ ఆవు మూత్రంపై 7 పేటెంట్లు సాధించారు.

ఇవీ పేటెంట్ల వివరాలు..
అమెరికా నుంచి గోమూత్రం రోగ నిరోధకంగా
2. కేన్సర్‌ నిరోధకంగా
3. ఆరోగ్యానికి హాని కలిగించే బ్యాక్టీరియా నాశనకారిగా
4. మొక్కల పెరుగుదలతో పాటు మొక్కలకు వచ్చే తెగుళ్ల నిరోధకంగా
5. మొక్కలలో ఏర్పడే వినాశకర క్రిమి నాశనకారిగా
6. మనుషులకు వంశపారంపర్యంగా కలిగే జన్యు లోపాలను సరిచేసే మందుగా పనికొస్తుందని నిరూపించే పరిశోధనల ప్రమాణాలతో పేటెంట్లు
7. అలాగే చైనా నుంచి మనుషులకు వంశపారంపర్యంగా కలిగే జన్యు లోపాలను సరిచేసే మందుగా పేటెంట్‌.

అంటే మన దేశంలోని దేశీ ఆవుల మూత్రం విశిష్టతను ప్రపంచానికి చాటిచెబుతూ హక్కులు కూడా పొందేలా కృషి చేశారు. గో విజ్ఞాన అనుసంధాన కేంద్రం ను స్థాపించిన వారికి, నిర్వహిస్తున్న వారికి ఈ కేంద్రం నిర్వహించే పరిశోధనల్లో పాలుపంచుకున్న వారికి భారతీయులందరూ రుణపడి వున్నారు.

ఇవిగో పేటెంట్‌ అని వచ్చిన వివరాలు

భారత్‌లోని దేశీ ఆవు మూత్రంతో కూడిన మిశ్రమం మొక్కలకు చీడపీడలను తట్టుకునే శక్తిని, వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడే శక్తిని, భూమిలోని తెగుళ్లను వ్యాపింప చేసే బ్యాక్టీరియా మొక్కకు సోకకుండా నిరోధించే శక్తిని, భూమిలోని తెగుళ్లను వ్యాపింపజేసే బ్యాక్టీరియా మొక్కకు సోకకుండా నిరోధించే శక్తిని, భూమిలోని పోషకాలను మెత్తగా చేసి మొక్కల వేళ్లకు అందించే శక్తితో పాటు భూమి సారవంతమయ్యే గుణాలను పెంపొందించగలదని అమెరికా 29.8.2006 న పేటెంట్‌ ఇచ్చింది.
2. వేప చిన్న ఉల్లితో కూడిన మిశ్రమం మొక్కలు బలంగా ఎదగడానికి, చీడపీడలను తట్టుకునే శక్తిని, వాతావరణ మార్పులను తట్టుకొని నిలబడే శక్తిని, మొక్కకు రోగ నిరోధక శక్తిని, భూమిలోని పోషాలను మొక్కల వేళ్లకు అందించే శక్తితో పాటు భూమి సారవంతమ్యే గుణాలను పెంపొందించగలదని తెలిపే పేటెంట్‌ హక్కు అమెరికా 20`11`2007 ను ఇచ్చింది.
గో విజ్ఞాన అనుసంధాన కేంద్రం ఎక్కడుంది?
ఇది నాగపూర్‌కి 60 కిలోమీటర్ల దూరంలోని దేవలాపూర్‌లో 1996 లో స్థాపించారు. సుమారు 30 ఎకరాలలో గోశాల, గోఔషధీ ఉత్పత్తులు, పంచగవ్యాల సేకణ, పరిశోధనలు, గోమాత విశిష్టత, పరిరక్షణపై సదస్సులు, శిక్షణా తరగతులను ఇది నిర్వహిస్తుంది. సంస్థకు సంబంధించిన, సంస్థతో దేశవ్యాప్తంగా సంబంధాలున్న నిష్ణాతులైన వైద్యులు ఎంతో అధ్యయనం చేసి, ఆయుర్వేదంలో చెప్పిన ఆవుపేడ, మూత్రం, పాలు, పెరుగు, నెయ్యికి సంబంధించిన ఔషధ ప్రయోగాలను సంకలనం చేశారు. వీటి ద్వారా చికిత్స చేసే విధానాన్ని ‘‘పంచగవ్య ఆయుర్వేద చికిత్సా పద్ధతి’’ అంటారు.

ఈ సంస్థ కేంద్ర కార్యాలయం నాగపూర్‌లో వుంది. పట్టణంలోని మహల్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న పంచగవ్య చికిత్స కేంద్రంలో వేలాది మంది రోగులు చికిత్స పొంది ఆరోగ్యవంతులయ్యారు. ఇక్కడ మూత్ర పిండాలకు సంబంధించిన వ్యాధులు, మూత్రాశయంలో రాళ్లు, బీపీ, సుగర్‌, సొరియాసిస్‌, చుండ్రు, కీళ్ల వ్యాధులు, పచ్చ కామెర్లు, మానసిక వ్యాధులతో పాటు అసాధ్యమనుకున్న రోగాలకు చికిత్స అందిస్తున్నారు. గోజాతి అభివృద్ధి, పంచగవ్య ఆధారిత వ్యవసాయంపై, పంచగవ్య సేకరణ, ఆచరణలపై ఈ కేంద్రం శిక్షణా తరగతులను కూడా నిర్వహిస్తుంది. నేపాల్‌, భూటాన్‌, సహా ఇతర దేశాల వారు కూడా ఇక్కడికి వస్తుంటారు. గోసంరక్షణ, పంచగవ్య తయారీపై శిక్షణ తీసుకుంటారు. ఆవు మూత్రం ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తితో క్యాలిక్యులేటర్‌, గడియారాన్ని నడిపించే విషయాన్ని కూడా ఈ సంస్థే తెలిపింది.

25 రకాల ఔషధ ఉత్పత్తి

ఆవు మూత్రం ఆధారంగా సుమారు 25 రకాల ఔషధాలను ఈ కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్నారు. వీటితో పాటు ఆవుపేడతో సబ్బు, ధూప్‌స్టిక్‌, దోమల నిరోధానికి కాయిల్స్‌ తయారు చేస్తున్నారు. ఈ కేంద్రం తన విధులను నిర్వర్తించడంలో సునీల్‌ మన్‌సింఘ్కా విశేషంగా పనిచేస్తుంటారు. భారత దేశం పాడి పంటలతో తులతూగాలన్నా, రైతాంగం సంపదలతో అభివృద్ధి చెందాలన్నా దేశీ ఆవు అండగా వుండాలి. భారతీయులందరూ ఆరోగ్యకరమైన తిండి తినాలన్నా, పంట భూములు సస్యశ్యామలంగా ఉండాలన్నా ఆవు వుండాలని, ప్రకృతి సేద్యమే శరణ్యమని సునీల్‌ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *