భాగ్యనగరంలో భవ్యంగా గోల్కొండ సాహితీ మహోత్సవం

సమాచార భారతి నిర్వహించిన ‘‘గోల్కొండ సాహితీ మహోత్సవ’’ కార్యక్రమాలు హైదరాబాద్‌ లోని నారాయణగూడ కేశవ స్మారక విద్యాసంస్థల ప్రాంగణంలో నవంబర్‌ 20, 21 తేదీల్లో ఘనంగా జరిగాయి. ‘‘అజాదీ కా అమృతోత్సవాలలో భాగంగా జాతీయ సాహిత్య పరిషత్‌, ఇతిహాస సంకలన సమితి, సంస్కార భారతి, ప్రజ్ఞాభారతి, తదితర సంస్థలు సంయుక్తంగా గోల్కొండ సాహితీ ఉత్సవాన్ని నిర్వహించాయి. హర్యాన గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ముఖ్య అథితిగా, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి, కోవెల సుప్రసన్నాచార్య విశిష్ట అతిథులుగా, ఆర్‌.ఎస్‌.ఎస్‌. అఖిల భారత కార్య కారిణీ సదస్యులు వి. భాగయ్య  ప్రధాన వక్తగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో ‘‘స్వరాజ్య సాధనలో ఆర్‌.ఎస్‌.ఎస్‌’’, ‘‘ఆంగ్లేయుల ఏలుబడి: అంతులేని దోపిడి’’, “Nizam’s Rule Unmasked” అనే గ్రంథాలను ఆవిష్కరించారు. ప్రముఖ సాహితీవేత్త, కాకతీయ విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు కోవెల సుప్రసన్నచార్య గారిని సన్మానించారు.

ఆ తరువాత ‘‘స్వధర్మం, స్వాభిమానం, స్వరాజ్యం మూలంగా ప్రచురితమైన సాహిత్యం’’ అనే అంశంపై రచయితలు, ప్రచురణ కర్తలతో సమావేశం జరిగింది. అనంతరం ‘‘స్వాతంత్య్ర సమరంలో సాహిత్యం, జానపద కళల పాత్ర’’పై సంగోష్టి కార్యక్రమం జరిగింది. మాదపూర్‌లో కూడా పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.

సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నగరం లోని 6 పాఠశాలలకు చెందిన విద్యార్థులు కలిసి ‘‘హైదరాబాద్‌ విమోచనం’’ అంశంపై అద్భుతమైన నాటకం ప్రదర్శించారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో ‘‘మాతృస్తవం’’ అనే అంశంపై ఒక నృత్యరూపకం ప్రదర్శించారు.

రెండో రోజు నవంబర్‌ 21న ‘‘స్వరాజ్య ఉద్యమాలు’’ అనే అంశంపై జరిగిన సంగోష్టి జరిగింది. తరువాత యువ రచయితలతో సంగోష్టి కార్యక్రమంలో పలువురు ఔత్సాహిక రచయితలు పాల్గొన్నారు.

గోల్కొండ సాహితీ మహోత్సవ ముగింపు కార్యక్రమం పేరిణీ శివతాండవ నృత్యంతో ప్రారంభమైంది. జస్టిస్‌ ఎల్‌. నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా, డా. టి.హనుమాన్‌ చౌదరి, డా. సంజీవ కుమార్‌ శర్మ విశిష్ట అతిథిలుగా, ఆర్‌.ఎస్‌.ఎస్‌ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ శ్రీ సునీల్‌ అంబేకర్‌ ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘‘చరిత్ర పరిశోధన వ్యాసాలు’’, ‘‘తెలంగాణ విముక్తి పోరాటంలో అజ్ఞాత వీరులు’’ అనే పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. అనంతరం రచయిత కందకుర్తి యాదవరావు దంపతులను సన్మానించారు.

శ్రీ సునీల్‌ అంబేకర్‌ మాట్లాడుతూ ఎన్నో ఆక్రమణలు, ఎంతో సుదీర్ఘ పరిపాలన తర్వాత కూడా తెలుగు సాహిత్యం ఉన్నతంగా నిలబడిరదని అన్నారు. ఆంగ్లేయులను దేశం నుంచి తరమడానికి మాత్రమే మనం సంఘర్షణ చేయలేదని, మన స్వధర్మాన్ని, సంస్కృతిని కాపాడటానికి కూడా సంఘర్షణ చేశామని ఆయన గుర్తు చేశారు. ఈ దేశాన్ని ఏ విధంగా మార్చుకోవాలో రాజ్యాంగ నిర్మాతలు మనకు రాముని చిత్రంతో మనకు సూచించారని, దాని కోసం మన భావితరం, యువతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. డా.అమర్‌ నాథ్‌ వందన సమర్పణతో ఉత్సవాలు ముగిశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *