గోంగూర
వెల్లులి బెట్టి పొగిచిన
పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా?
మొల్లముగ నూని వేసుక
కొల్లగ భుజియింపవలయు గువ్వల చెన్నా!
పైన చెప్పిన పద్యం గువ్వలచెన్న శతకంలోనిది. దీనిలో ఆ కవి వర్ణించిన తీరు చూస్తుంటే తెలుస్తుంది. గోంగూర గొప్పతనం. ఇప్పుడు మీకు దానిలోని పోషక విలువలు గురించి చూద్దాం.
– దీనిని సంస్కృతంలో పీలు, గుచ్ఛఫల, ఉష్ణప్రియ అని కూడా పిలుస్తారు.
– ఆకుకూరలలో ఇది మిక్కిలి ప్రశస్తమైనది.
– ఈ ఆకుల్లో రాగి ఎక్కువ ఉంటుంది.
– దీనిలో పోటాష్ కూడా ఉంటుంది.
– ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో గోంగూరని వేడిని కలుగజేసేదిగా పేర్కొన్నది. బలం కలుగచేసే ఆకుకూర గా తెలియచేశారు .
– రక్తపిత్తవ్యాధి అనగా నోటినుంచి రక్తం పడు వ్యాధిని హరించును.
– శరీరంలోపలి గడ్డలు, మూలవ్యాధి, స్ప్లీన్ సంబంధ సమస్యలను నివారించవచ్చు.
– వాతం, కఫం ఉన్నవారు దీనిని లోపలికి తీసుకోవలెను.
– ఇది మంచిరసాయనం.
– గోంగూర మంచి బలకారం అయిన శాకం. అందుకే గొంగూర పచ్చడి కోడి మాంసంతో సమానం అయినది అని చెప్తారు.
– రే చీకటి రోగం కలవారు ఈ కూర చాలా మేలు చేస్తుంది.
– గోంగూర ఉడికించిన నీళ్లు తాగుతూ చప్పిడి పథ్యం చేస్తే ఉబ్బురోగాలు తగ్గుతాయి అని చెప్తారు.
– బోదకాలు వ్యాధి ఉన్నవారు వేపాకుతో పాటు గోంగూరని నూరి కాళ్లకు కడితే గుణకారిగా ఉంటుంది.
– గేదల లేగదూడలకు నాలుగయిదు గోంగూర ఆకులు పెట్టడం వలన మల సమస్య తీరి ఆరోగ్యంగా ఎదుగుతాయి.
– గోంగూరని ఎక్కువ ఉడికించడం, కుక్కర్లలో ఉడికించడం వలన దానిలోని జీవపోషకాలు నశిస్తాయి.
– ఈ గోంగూరని ఎక్కువుగా వాడకూదు. శరీరంలో వేడిని పెంచుతుంది. మలబద్దకం సమస్యను తెస్తుంది.
– ఉషాలావణ్య పప్పు