రైతులకు శుభ వార్త… ఇక.. ప్రతీ గ్రామీణ జిల్లాకి ఒక ”కృషి విజ్ఞాన కేంద్రం”..నిర్ణయం తీసుకున్న కేంద్రం
రైతులకు సాంకేతికంగా ఏ అనుమానాలు వచ్చినా.. మరే ఇతర అనుమానాలు వచ్చినా… ముదుండి అనుమానాలు తీర్చే కేంద్రం కృషి విజ్ఞాన కేంద్రాలు. దేశ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే.. ప్రస్తుతం 740 వరకు మాత్రమే వున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా కృషి విజ్ఞాన కేంద్రాల సంఖ్యను మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దేశ వ్యాప్తంగా ప్రతి గ్రామీణ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయాలని సంకల్పించుకుంది. అయితే ప్రస్తుతం వున్న కేంద్రాలను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా, జిల్లా స్థాయి సమగ్ర వ్యవసాయ కేంద్రాలుగా మారుస్తారు. కేంద్రం ఈ నిర్ణయం తీసు కోవడంతో రాష్ట్రాలన్నీ తమకు అవససమైన వివరాలను సిద్ధం చేసుకొని, కేంద్రానికి పంపిస్తున్నాయి.
తెలంగాణలో ఇప్పటి వరకు 16 కేంద్రాలున్నాయి. మరో 16 కొత్తగా కృషి విజ్ఞాన కేంద్రాలు రానున్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్, వైరా, పాలెం, నల్లగొండ జిల్లాలోని కంపాసాగర్ , నిజామాబాద్ జిల్లాలోని రుద్రూరు, మహబూబ్ నగర్ జిల్లా మల్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమల్లెపాడు, మంచిర్యాల జిల్లాలోని బుడాకలాన్‌లో ఈ కేవీకేలు వున్నాయి. వీటితో పాటు పశువైద్య యూనివర్శిటీ ఆధ్వర్యంలో నడిచే కేవీకేలు మరికొన్ని వున్నాయి. హన్మకొండ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా రామగిరిఖిల్లా, రంగారెడ్డి జిల్లా హయత్ నగర్‌లో ఈ కేంద్రాలున్నాయి. అలాగే జమ్మికుంట, మహబూబునగర్‌లోని మదనాపురం, ససగారెడ్డి లోని దిడ్గి, నల్గొండలోని గరిడేపల్లి తదితర ప్రాంతాల్లో వున్నాయి.
కొత్తగా ఏర్పాటయ్యే కేవీకే కేంద్రాల జాబితా ఇదే…
పైన పేర్కొన్న కేవీకే కేంద్రాలే కాకుండా కేంద్ర ప్రభుత్వం కొత్తగా మరికొన్ని జిల్లాల్లో ఈ కేవీకే కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యింది. దీంతో ఆససఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, వరంగల్, వికారాబాద్, ససరిససల్ల, వనపర్తి, ససద్దిపేట, ససర్యాపేట, ములుగు భూపాలపల్లి, గద్వాల, జగిత్యాల, జనగామ, మెదక్, మేడ్చల్ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు అవుతాయి. దీని కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
కృషి విజ్ఞాన కేంద్రం చేసే పనులివీ
సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులు రైతులకు పరిచయం చేయడం.. శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం.. వాతావరణ సమాచారం.. పంటల యాజమాన్యం.. చీడపీడల నివారణ.. నూతన వంగడాలను రైతులకు అందించి.. క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఫలితాలను రైతులకు తెలియజేయడం వంటివి కేవికే అధ్వర్యంలో నడుస్తున్నాయి.
కృషి విజ్ఞాన కేంద్రం అంటే వ్యవసాయ విజ్ఞాన కేంద్రం అన్నమాట ఇది భారత వ్యవసాయ పరిశోధన మండలి యొక్క వినూత్న సంస్థ. మొదటి కేవికే 1974లో స్థాపించబడింది. 650కిపైగా దేశంలో కేవికేలు ఉన్నాయి. వీటికి ICAR నిధులు సమకూరుస్తుంది. ICAR ఇన్‌స్టిట్యూట్‌లు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రభుత్వేతర సంస్థలు , స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా వీటి నిర్వాహణ జరుగుతుంది. సంప్రదాయ సాగుతో నష్టాలు ఎదుర్కొం టున్న రైతులకు ఆధునిక సేద్యంతో అధిక దిగుబడులు సాధించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాలు సహకరిస్తున్నాయి. నూతన సాంకేతికత పరిజ్ఞానం, సాగు రంగంలో ఉపాధి మార్గాలు చూపుతున్నాయి. ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేసి కొత్త పరిశోధనలను రైతులకు చేరువ చేస్తోంది. రైతులు, వ్యవసాయ మహిళలు, గ్రామీణ యువకులు , విస్తరణ సిబ్బంది , నైపుణ్యాలను పెంపొందించడానికి సాంకేతిక అభివృద్ధితో ముందుకు నడిపించడానికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది.