స్వాతంత్రం తరువాత అది పెద్ద కార్మిక సంస్కరణ.. ప్రకటించిన కేంద్రం
స్వాతంత్ర్యం తరువాత అది పెద్ద కార్మిక సంస్కరణకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా రూపొందించిన నాలుగు కార్మిక స్మృతులను (Labour Codes) తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు ఇవాళ (శుక్రవారం) ప్రకటించింది.
1. వేతనాలకు సంబంధించిన కోడ్ 2019(Code on Wages, 2019)
2. శ్రామిక యూనియన్‌లు, ఉద్యోగ వివాదాల నియమాల కోడ్ 2020(Industrial Relations Code, 2020)
3. సాంఘిక భద్రతా ప్రయోజనాలైన ఇన్స్యూరెన్స్, పీఎఫ్, వైద్యానికి సంబంధించిన కోడ్ 2020 (Code on Social Security, 2020)
4. పని స్థలంలో భద్రత, ఆరోగ్యం, పని షరతుల నియంత్రణ కోడ్ 2020(Occupational Safety, Health & Working Conditions (OSHWC)
‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనలో భాగంగా మారుతున్న పనితీరు, పరిస్థితులకు అనుగుణంగా శ్రామిక వ్యవస్థను సంసిద్ధం చేయడమే ఈ సంస్కరణల లక్ష్యమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ చారిత్రక నిర్ణయంతో కార్మిక నిబంధనలు, కార్మికుల సంక్షేమం మెరుగవుతుందని ఆయన అన్నారు.
తాజా సంస్కరణలతో ఆ సమస్య తొలగిపోతుందని కేంద్రమంత్రి ధీమా వ్యక్తం చేశారు. కొత్త లేబర్ కోడ్‌లకు సంబంధించిన చట్టానికి 2020లోనే ఆమోదం లభించిందని.. కానీ, వివిధ రాష్ట్రాలు నిబంధనలను నోటిఫై చేయడంలో ఆలస్యం చేయడంతో అమలు వాయిదా పడుతూ వచ్చిందని చెప్పారు.
మరిన్ని ప్రయోజనాలివీ…
1. ఉద్యోగులందరికీ నియామక పత్రం తప్పనిసరి, దీంతో ఉద్యోగ భద్రత. లిఖిత పూర్వక హామీ.
2. గిగ్, ప్లాట్ ఫారమ్ కార్మికులు సహా ఉద్యోగులందరికీ సామాజిక భద్రత, బీమా
3. ఫిక్స్ డ్ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు
4. అందరి కార్మికులకు కనీస వేతనం చట్టబద్ధమైన హక్కు
5.యజమానులు సకాలంలో వేతనాలు చెల్లించడం తప్పనిసరి, ఐటీ ఉద్యోగులకు ఏడో తేదీ లోపు చెల్లింపులు.
6. 40 ఏళ్లు పైబడిన వారందరికీ యాజమాన్యాలు ఉచిత వార్షిక వైద్య పరీక్షలు అందించడం తప్పనిసరి.
7. సమాన పనికి సమాన వేతనం తప్పనిసరి,
8. సాధారణ పని గంటలు దాటి పనిచేస్తే రెగ్యులర్ వేతనానికి రెట్టింపు చెల్లించాలి.