రైతులకు గుడ్ న్యూస్.. 14 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ సీజన్ లో వరి పంట సహా 14 పంటలకు మద్దతు ధర పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ కేబినెట్ భేటీలోనే 14 పంటలకు మద్దతు ధర పెంపుకు ఆమోదం లభించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

2025-2026 ఖరీఫ్ సీజన్ కి సంబంధించి క్వింటాల్ వరిపై 69 రూపాయలు పెంచడంతో కనీస మద్దతు ధర 2369 కి చేరింది.గత 11 సంవత్సరాలలో ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర బాగా పెంచామని తెలిపారు. ఆయా పంటలకు కనీస మద్దతు ధర కోసం 2.7 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైతులకు వడ్డీ రాయితీ కింద 15,642 కోట్లతో పాటు అన్నదాతల పెట్టుబడిపై 50 శాతం మార్జిన్ వుండేలా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు.

2025-26 ఖరీఫ్ సీజన్ కోసం 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (MSP) కేంద్ర కేబినెట్ ఆమోదించింది. వాటి వివరాలు

జొన్నలు క్వింటాకు రూ. 328 పెంపు

సజ్జలు క్వింటాకు రూ.150 పెంపు

రాగులు క్వింటాకు రూ.596 పెంపు

మొక్కజొన్న క్వింటాకు రూ.175 పెంపు

కందిపప్పు క్వింటాకు రూ.450 పెంపు

పెసర్లు క్వింటాకు రూ.86పెంపు

మినుములు క్వింటాకు రూ.400 పెంపు

వేరుశనగ క్వింటాకు రూ.480 పెంపు

పొద్దుతిరుగు క్వింటాకు రూ.441 పెంపు

సోయాబీన్ క్వింటాకు రూ.436 పెంపు

కుసుములు క్వింటాకు రూ.579 పెంపు

ఒలిసెలు క్వింటాకు రూ.820 పెంపు

పత్తి క్వింటాకు రూ.589 పెంపు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *