రైల్వే స్టేషన్లకి సాధు సంతులు, స్వాతంత్ర యోధుల పేర్లు పెట్టిన యూపీ సర్కార్
యూపీ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. లక్నో డివిజన్ లోని ఎనిమిది రైల్వే స్టేషన్లకు పేరు మార్చినట్లు ప్రకటించింది. ఇప్పటి వరకూ హిందూ వ్యతిరేక పేర్లున్న రైల్వే స్టేషన్లకు సాధు సంతులు, స్వాతంత్ర సమరయోధుల పేర్లను పెట్టింది. ఖాసీంపూర్ హాల్ట్, జైస్, మిస్రౌలీ, బని, నిహాల్ ఘర్, అక్బర్ గంజ్, వజీర్ గంజ్ హాల్ట్ మరియు ఫుర్సత్ గాన్ రైల్వే స్టేషన్ల పేర్లు మారాయి. ఖాసీంపూర్ హాల్ట్ ఇకపై జైస్ సిటీగా, జైస్ రైల్వే స్టేషన్ ను గురు గోరఖనాథ్ ధామ్ గా, మిస్రౌలీ పేరును మా కాళీకాన్ ధామ్ గా మార్చారు. ఇక… బనీ రైల్వే స్టేషన్ ను స్వామి పరమహంస్ గా, నిహాల్ ఘర్ పేరును మహారాజా బిజిలీ పాసిగా మార్చారు.ఇక.. అక్బర్ గంజ్ పేరును మా అహోర్వ భవానీ ధామ్ గా, వజీర్ గంజ్ హాల్ట్ పేరును అమర్ షహీద్ భలే స్తుల్తాన్ గా మార్చారు. మరోవైపు ఫుర్సత్ గంజ్ పేరును ఇకపై తాపేశ్వర నాథ్ ధామ్ గా మార్చారు.