ఊరక పలకరు మహానుభావులు

జమ్‌షెడ్జీ నస్సర్బాన్జీ టాటా జర్మనీకి పనిమీద ప్రయాణం పెట్టుకున్నారు. అప్పట్లో ఓడ ప్రయాణం. ఆయన తన మొదటి తరగతి క్యాబిన్‌ ‌తలుపు ముందు నిలబడి చూస్తున్నారు. కింది అంతస్తులో హడావుడిగా ఉండడాన్ని ఆయన గుర్తించి, ఏమిటని అడిగారు.

భారతీయ మహా సాధుపుంగవులు స్వామి వివేకానంద ఓడలో కింద ఉన్నారని చెప్పారు. అంతే ఎంతో ఉత్సాహంగా, జెఎన్‌ ‌టాటాగారు స్వామివారి దగ్గరికి వెళ్లారు. స్వామి వివేకానంద ఆ మహా పారిశ్రామికవేత్తగురించి ముందే విని ఉన్నారు. ఓడ ప్రయాణం కదా. తాపీగా వారిమధ్య సంభాషణ కొనసాగింది. టాటాగారు తన జర్మనీ ప్రయాణం ఎందుకన్నది చెప్పారు.

‘‘నేను మన దేశంలోని వివిధ ప్రాంతాల మట్టి నమూనాల సంచులను తీసుకుని జర్మనీలో పరీక్షించే నిమిత్తం తీసుకుపోతున్నాను. ఎక్కడ తవ్వితే ఇనుమును లాభసాటిగా సేకరించగలమో తెలుసుకుని ఆ పని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నాను’’ అని చెప్పుకున్నారు.

అది విన్న స్వామి చిరునవ్వు నవ్వి ‘‘బాగుంది. మీరు తీసుకువెళ్లే సంచుల్లో ఇనుప ఖనిజం సంమృద్ధిగా ఉన్న మట్టి నమూనాలు ఉంటే మాత్రం, ఆ జర్మనులు నిజం చెబుతారా? ఇక్కడ మనమో విషయాన్ని గమనించుకోవాలి. ఏ యూరప్‌ ‌దేశం కూడా బలమైన, లోహసమృద్ధిని, ఆర్ధిక స్వాతం త్య్రాన్ని, స్వయంస•మృద్ధిని సాధించిన భారతదేశాన్ని చూడాలనుకోదు. మీ దగ్గరి నమూనాల్లో ఇనుప ఖనిజం సమృద్ధిగా ఉన్నా ఆ యూరప్‌ ‌దేశాలవారు ఆ విషయం చెపుతారని అనుకోను. వారు మీలో అపనమ్మకాన్ని, నిరాశను కలిగించాలని చూస్తారు.’’

అప్పటికే ఎన్నోసార్లు యూరప్‌ ‌సంస్థలతో వ్యక్తులతో మాట్లాడి ఉన్న జెఎన్‌ ‌టాటాగారికి ఈ విషయంలో అనుమానం ఉంది. కాబట్టే వెంటనే ఏమీ అనలేక పోయారు. స్వామి వివేకానంద ‘‘మీరే మట్టి నమూనాలను పరీక్షించడం, లోహాన్ని మరింత లాభసాటిగా సేక రించేందుకు కావలసిన పరిశోధనలు నిర్వహించే ప్రయత్నాలు ఎందుకు చేయకూడదు. మెరికల్లాంటి కొందరు మన భారత యువకులకు శిక్షణ ఇచ్చే ప్రయత్నాలు ఎందుకు చేయకూడదు? అందుకు కావలసిన అన్ని అత్యంత ఆధునిక సదుపాయాలతో ఒక మంచి కళాశాలను ఏర్పాటు చేయవచ్చు కదా. ఇప్పుడది వ్యర్థం,  అనవసర భారం కూడా అనిపించవచ్చును. కానీ, ముందు ముందు మంచి ఫలితాలను సాధించ గలుగుతాం. యూరప్‌ ‌ట్రిలకు అయ్యే బోలెడు ఖర్చు తగ్గుతుంది. నమూనాలను దేశంలోనే పరీక్షించే వెసలుబాటు ఉంటే, మీరు తొందరగా పరీక్షలు చేయించుకుని నిర్ణయాలు వేగంగా తీసుకోగలుగుతారు. సరిగ్గా పరీక్షించారో లేదోననే అనుమానంతో, ఒకరు కాదంటే మరొకరి దగ్గరకు నమూనాలు పట్టుకుని ఇప్పటిలా పరుగులు తీసే ప్రయాస మీకు తప్పుతుంది.’’ అన్నారు.

జెఎన్‌ ‌టాటాగారిలో సానుకూలతను పసిగట్టిన స్వామి వివేకానంద ‘‘మీరు మైసూర్‌ ‌మహారాజావారు శ్రీ హెచ్‌ఆర్‌హచ్‌. ‌చామరాజ వడయార్‌ ‌గారిని సంప్రదించండి. బ్రిటీష్‌వారికి సామంతులుగా ఉన్నప్పటికి ఆయన కచ్చితంగా ఈ విషయంలో మీకు అన్నివిధాల సహాయపడతారు. హెచ్‌ఆర్‌హచ్‌. ‌చామరాజ వడయార్‌ ఎం‌త ఉదా రులంటే, నా చికాగో యాత్రకు కావలసిన మొత్తాన్ని ఆయనే సహాయంగా అందించారు’’ అని చెప్పారు.

జెఎన్‌ ‌టాటాగారు భారత్‌కు తిరిగి వస్తూనే తిన్నగా వెళ్లి మైసూర్‌ ‌మహారాజావారిని కలిశారు. చామరాజ వడయార్‌ ఆయన్ని ఏమాత్రం నిరాశపరచలేదు. ఆలోచనను గొప్పగా స్వాగ తించారాయన. టాటా కోరుకున్న పరిశోధనలకు కావలసిన సౌకర్యాలతో, ఒక ప్రతిష్ఠాత్మక కాలేజీని ఏర్పాటు చేయడానికి 370 ఎకరాల భూమిని కెటాయిం చేశారు. అట్లా ఆ ముగ్గురు భరతమాత ముద్దుబిడ్డల పుణ్యాన వెలసిన దేవాలయం ‘ది ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌సైన్స్’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *