గాడిద ఫామ్ తో లక్షల సంపాదన.. ఎగబడుతున్న బ్యూటీ ఉత్పత్తుల కంపెనీలు

ధీరేణ్‌ సోలంకీ… గుజరాత్‌కి చెందిన వ్యక్తి. ఇప్పుడు దేశంలో బాగా పాపులర్‌ అయ్యాడు. గాడిదల పెంపకంతో ఏకంగా లక్షల్లో సంపాదిస్తున్నాడు. దేశ వ్యాప్తంగా గాడిదల ప్రాముఖ్యత పెరగడంతో ఆయన ఉపాధి కోసం దీనిని ఎంచుకున్నాడు. సోలంకీ చాలా రోజుల పాటు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్‌ అయ్యాడు. ఫలితాలు అనుకూలంగా రాకపోవడంతో ప్రైవేట్‌ సంస్థల్లో చేశాడు. ఆర్థికంగా పెద్దగా లాభం లేకపోవడంతో ఆయన ఉపాధి మార్గాలు అన్వేషించాడు. గుజరాత్‌, చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో గాడిదల పెంపకానికి, ఫామ్‌కి బాగా డిమాండ్‌ వుందని అర్థమైంది. వెంటనే రంగంలోకి దిగిపోయాడు.

మొదట కేవలం 20 గాడిదలతో సొంత ఊళ్లోనే గాడిదల ఫామ్‌ ప్రారంభించాడు. 22 లక్షలతో పెట్టుబడి పెట్డాఉ. అవి రానూ రానూ 42 గాడిదలయ్యాయి. ఇప్పుడు గాడిద పాలను అవసరం వున్న వారికి పెద్ద మొత్తంలో సరఫరా చేస్తున్నాడు. నెలకు 4 లక్షల వరకూ సంపాదిస్తున్నాడు. అయితే.. ఫామ్‌ ప్రారంభంలో కాస్త కష్టంగానే అనిపించిందని, గాడిద పాలకు అస్సలు గిరాకీ దొరికేది కాదన్నాడు. దక్షిణ భారతంలోని కస్టమర్లు, వ్యాపారులను సంప్రదించాను. అప్పుడు గిరాకీ ప్రారంభమైంది. ఇప్పుడు కేరళ,కర్నాటక ప్రాంతాలకు గాడిద పాలను సరఫరా చేస్తున్నాడు. బ్యూటీషియన్‌ కోసం వాడే వస్తువుల్లో దీనిని వాడుతారు. దీనిని తెలిసి బ్యూటీ ఉత్పత్తుల కంపెనీలను సంప్రదించి, వారితో వ్యాపారం చేస్తున్నాడు.

గాడిద పాలు లీటర్‌కి 7 వేల వరకు వుంటుందని సోలంకీ తెలిపాడు. ఆ పాలు మరింత తాజాగా వుండడానికి ఫ్రీజర్లను కొనుగోలు చేశానని, వాటిల్లో నిల్వ చేస్తున్నట్లు తెలిపాడు. కొన్ని రోజుల వరకు ఆఫ్‌ లైన్‌ వ్యాపారం, తెలిసిన వారికే అమ్మాడు. తర్వాత ఆన్‌లైన్లో వ్యాపారం చేస్తూ.. లక్షలు సంపాదిస్తున్నాడు. సాధారణ వ్యక్తులు కూడా గాడిద పాలను కొనుగోలు చేస్తున్నారు. కోరింత దగ్గు, వైరల్‌ జ్వరాలు, ఆస్తమాకి కూడా ఈ గాడిద పాలను వాడుతున్నారు. ఇది ఔషధంగా పనిచేస్తుంది. గాడిద పాలల్లో ఏ,బీ, బీ12, సీ, డీ, ఇ విటమిన్లు వుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *