వక్ఫ్ బోర్డులకు ఝలక్… ఇకపై కోర్టులో ఫీజు చెల్లించాల్సిందే : హైకోర్టు కీలక తీర్పు

వక్ఫ్ బోర్డు విషయంలో గుజరాత్ హైకోర్టు ఓ కీలకమైన తీర్పును వెలువరించింది. కోర్టు ఫీజు చెల్లించకుండా వక్ఫ్ బోర్డు ఇకపై కేసులు దాఖలు చేయరాదని కీలక తీర్పునిచ్చింది. వారం రోజుల విచారణ తర్వాత, వక్ఫ్ సంస్థలు దాఖలు చేసిన దాదాపు 150 పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.దీంతో చాలా కాలంగా వున్న ఓ సంప్రదాయానికి ముగింపు పలికినట్లైంది. వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన 150 పిటిషన్లను కొట్టివేస్తూ గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేసీ దోషి ఈ నిర్ణయం తీసుకున్నారు. కోర్టులు మరియు ట్రిబ్యునళ్లకు అప్పీలు చేసుకునేటప్పుడు వక్ఫ్‌లు ప్రత్యేక మినహాయింపులను పొందారు. కానీ.. దేవాలయాలు, ఇతర మతపరమైన సంస్థలు మాత్రం కోర్టు రుసుములను చెల్లించాల్సి వస్తోంది.
సున్నీ ముస్లిం ఇద్గా మసీదు ట్రస్ట్, వడోదర సహేర్ మసీదు సభ ట్రస్ట్, అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్ రోజా కమిటీ వంటి వక్ఫ్ ట్రస్టులు గుజరాత్ రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ ఆదేశాలను సవాలు చేస్తూ పిటిషనర్లు దాఖలు చేశారు.ఏదైనా వివాదాన్ని విచారించే ముందు కోర్టు ఫీజులను డిపాజిట్ చేయడం అవసరమని ఈ ఉత్తర్వులు పేర్కొన్నాయి.ఇప్పటి నుంచి న్యాయ ప్రక్రియలో పాల్గొనడానికి వక్ఫ్ నిర్దేశించిన రుసుమును చెల్లించాల్సిందే. అంతేకాకుండా ఇరు పక్షాల మధ్య వివాదంలో వున్న వక్ఫ్ ట్రస్టులు ట్రిబ్యునల్ ముందు ఉపశమనం కోరాయని మరియు వారి హక్కులు మరియు బాధ్యతలను చట్టబద్ధంగా నిర్ణయించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది.కాబట్టి, ఈ కేసులు సాధారణ దరఖాస్తులు కావని, పూర్తి వివాదానికి సంబంధించిన వ్యాజ్యం లాంటివి.వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 83 కింద దాఖలు చేసిన దరఖాస్తులు న్యాయపరమైన ప్రక్రియ కిందికే వస్తాయని కోర్టు పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *