తన జీవితాన్ని సమాజం కోసం ఇచ్చేసిన గొప్ప వ్యక్తి గురూజీ : పుస్తక సమీక్షలో వక్తలు
జాతీయ సాహిత్య పరిషత్ కర్నూలు శాఖ ఆధ్వర్యంలో శ్రీ గురూజీ – దృష్టి దార్శనికత, పుస్తక సమీక్షా సమావేశం కర్నూలులోని స్థానిక కేసీ కెనాల్ సమీపానగల వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం సమావేశ మందిరంలో జరిగింది.
సభాధ్యక్షులుగా ప్రముఖ సాహిత్య వేత్త తెలుగు భాషా పరిరక్షణ సమితి సాహితీ సదస్సు కార్యదర్శి శ్రీ JSRK శర్మ గారు మాట్లాడుతూ,” మాధవ గీత” ఆధారంగా తెలుగులో అనువదించబడిన ‘శ్రీ గురూజీ’ పుస్తకం ఆదర్శ వ్యక్తిత్వాన్ని అందరికీ అందించే గ్రంథం అన్నారు. పుస్తక సమీక్షకులు గా డాక్టర్ ఖాదరబాద్ ఉదయ శంకర్ గారు (నంద్యాల), ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యకారిణి సదస్యులు, మాట్లాడుతూ పుస్తక రచయిత రంగా హరి, అనువాదకుడు వేదుల నరసింహం అద్భుతంగా ఈ పుస్తకాన్ని రూపొందించారని, అందరూ చదవవలసిన పుస్తకంఅని అన్నారు.
ప్రతి ఒక్కరం స్వార్థాన్ని వీడి తన కుటుంబం కొరకే కాక భరతమాత సేవలో పాలు పంచుకోవాలన్నారు. జీవితాన్ని సమాజం కోసం ఇచ్చి పనిచేస్తున్న లక్షలాది స్వయంసేవకులు, కార్యకర్తలందరికీ స్ఫూర్తినిచ్చింది పరమ పూజనీయ డాక్టర్ జీ మరియు మాననీయ గురూజీ గోల్వల్కర్ అని తెలిపారు. పుస్తక అనువాదకులైన ప్రముఖ సీనియర్ పాత్రికేయులు ఇతిహాస సంకలన సమితి తెలంగాణ ప్రాంత కార్యదర్శి వేదుల నరసింహం మాట్లాడుతూ శ్రీ గురూజీ మహోన్నత వ్యక్తిత్వం తెలియాలంటే ఈ పుస్తకాన్ని చదివి, అనుసరించాలి అన్నారు.