సర్వాంతర్యామి

‘ఓంకారం మాదిరిగా భగవంతుడు ఒక్కడే. ఆయన సర్వాంతర్యామి. జీవకోటికి తండ్రిలాంటివాడు. అందరిలో, అన్నిటిలో పరమాత్ముని చూడగలినవారే భగవత్‌ కృపకు పాత్రులవుతారు. దేవుడు బాహ్యాచారాల వల్ల కాకుండా మానసిక సాధన ద్వారానే ప్రీతిచెందుతాడు. అహం, గర్వం, కోరికలు వదిలి అందరితో ప్రేమపూర్వకంగా మెలగాలి. సమభావం కలిగి ఉండాలి. నేను మనుషులను మాత్రమే చూస్తున్నాను. అతడు ధరించిన మతపరమైన దుస్తులు, విశ్వాసాలతో నిమిత్తంలేదు. ‘లోకంలో కుల మత వర్ణ వర్గ ధనికపేద ప్రాంత భేదాలు లేవు. ఉన్నదంతా మానవత, సమత, మమత. అవే మన అభిమతం కావాలి. వాటిని ప్రబోధించేందుకే నేనీ లోకానికి వచ్చాను. మాటలతో మతం లేదని, మానవులందరినీ సమంగా చూసేవాడే భక్తిపరుడని, తోటివారి ప్రేమను పొందకలిగిన వారే భగవంతుడిని చూడగలరు. నామ్‌ జపో (దేవుడి నామాన్ని తలుచుకో), కీరత్‌ కరో (భజన చెయ్యి), వంద్‌ చక్కో (అందరితోను పంచుకో)’.

– గురునానక్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *