జ్ఞానవాపిలో పూజలకు అనుమతి
మసీదు నేలమాళిగలోని శివాలయం ప్రాంతంలో పూజలు చేసే హక్కు హిందువులకు ఉందంటూ వారణాసి జిల్లా న్యాయమూర్తి డాక్టర్ అజయ్ కృష్ణ విశ్వేష్ తమ కీలక తీర్పులో వెల్లడిరచారు. ఈ పూజలు క్రమం తప్పకుండా జరుగుతాయని పూజ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. జనవరి 31, రాత్రి పూజలు పునఃప్రారంభ మయ్యాయి. ఇదిలా వుండగా, తీర్పునకు వ్యతిరేకంగా అంజుమన్ ఇంతె జామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో ఫిబ్రవరి 1, 2024న పిటిషన్ దాఖలు చేసింది.
జ్ఞానవాపి మసీదు సముదాయంలో గతంలో హిందూ పెద్ద దేవాలయం ఉండేదని ఆర్కియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండి హయా(ఏఎస్‌ఐ) నివేదిక వెల్లడిరచిన నేపథ్యంలో.. ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ ముస్లింలను డిమాండ్ చేశారు. ‘జ్ఞానవాపిలో ఆలయం ఉన్నట్టు అన్ని ఆధారాలూ బయటపడ్డాయి… ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించాలని ముస్లిం సోదరులను కోరుతున్నా’ అని గిరిరాజ్ సింగ్ అన్నారు.
అయోధ్యలానే హిందువులకు అత్యంత పవిత్ర స్థలాలైన మధుర, జ్ఞానవాపిలను ముస్లింలు గౌరవంగా అప్పగించాలని ప్రముఖ పురావస్తువేత్త కేకే మహమ్మద్ అభిప్రాయపడ్డారు. రాముడు, శివుడు, శ్రీ కృష్ణుడి దేవాలయాలు ఉన్న ప్రాంతా లతో హిందువులకు భావోద్వేగాలు ఉంటాయని, ఆయా ప్రాంతాలతో ముస్లింలకు పెద్దగా సెంటిమెంట్ ఉండదని అంటూ, అందుకే వాటిని పవిత్ర ప్రాంతాలుగా చూసుకునే హిందువులకు ఇచ్చేయడమే ఈ సమస్యకు పరిష్కారమని పేర్కొన్నారు. అయోధ్యలోని రాముడి గుడి నిర్మాణం, బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత నిజనిర్ధారణకు ఆ ప్రాంతాన్ని అధ్యయనం చేసిన భారత పురావస్తు శాఖ బృందంలో కేకే ముహమ్మద్ కూడా సభ్యుడిగా ఉన్నారు.