దేశ ఆర్ధిక స్వాతంత్య్రాన్ని హరిస్తున్న హలాల్‌ సంస్థలు

ఇటీవల ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం హలాల్‌ ఉత్పత్తులపై నిషేధం విధించింది. 15రోజుల లోపు అన్ని మాల్స్‌, దుకాణాల నుండి హలాల్‌ గుర్తింపు పొందిన ఆహార ఉత్పత్తులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఈ హలాల్‌ దోపిడి ఏమిటి? ఎలా సాగుతోంది?

 ‘హలాల్‌’ సర్టిఫికేషన్‌ వెనుక కేవలం మత పరమైన నిబంధన మాత్రమే కాకుండా, ఆర్ధిక దృష్టికోణం కూడా ఉంది. 2013వ సంవత్సరంలో మలేషియాలో ‘ప్రపంచ హలాల్‌ ఉత్పత్తిదారుల ఫోరమ్‌ సమావేశం’ పేరిట ఒక సదస్సు జరిగింది. అందులో పాల్గొన్న ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌ (ూIజ)కి చెందిన 57 ఇస్లామిక్‌ దేశాల ప్రతినిధులు అందరూ కలిసి ‘‘ఇస్లామేతర దేశాల నుండి దిగుమతి అయ్యే ఆహార పదార్ధాలు తప్పనిసరిగా ‘హలాల్‌’ గుర్తింపు కలిగి ఉండా ల్సిందే’’ అని ఒక తీర్మానం చేసుకున్నారు. ఇస్లామేతర దేశాల్లో ఆహార ఉత్పత్తులకు హలాల్‌ గుర్తింపునిచ్చేవి ఇస్లామిక్‌ సంస్థలే కాబట్టి ఈ నిబంధన ఆయా దేశాల్లోని ఇస్లామిక్‌ సంస్థలకు ఆర్ధికంగా పనికొస్తుంది అనేది దీని వెనుక అసలు ఉద్దేశం.

దేశీయ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న ఆహార పరదార్ధాల్లోని స్వచ్ఛతా ప్రమాణాలు, ఆయా పదార్ధాల తయారీలో వాడే వస్తువులపై నిఘా, నియంత్రణ, ఆయా కంపెనీల ఆహార ఉత్పత్తులకు గుర్తింపు జారీ కోసం భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఖీూూAI), ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఖీణA) సంస్థలు ఏర్పాటు అయ్యాయి. విచిత్రమేమిటంటే సెక్యులర్‌ దేశమైన భారత్‌లో పై రెండు ప్రభుత్వ సంస్థలను కాదని, కేవలం మతం ఆధారంగా సర్టిఫికేషన్‌ జారీ చేసే మరో ప్రక్రియ ఉంది. అదే హలాల్‌ సర్టిఫికేషన్‌. ఇస్లామిక్‌ నిబంధనలను అనుసరించి హలాల్‌ చేసిన ఆహార ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌ ఇచ్చేందుకు భారతదేశంలో కొన్ని ఇస్లామిక్‌ మతపరమైన సంస్థలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి.. జమియత్‌ ఉలేమా-ఇ-హింద్‌, జమియత్‌ ఉలేమా-ఇ-మహారాష్ట్ర, మరొకటి హలాల్‌ సర్టిఫికేషన్‌ ఇండియా సంస్థలు. ఇవన్నీ కూడా ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేని ప్రయివేట్‌ సంస్థలు.

ఆహార పదార్ధాలతో మొదలైన హలాల్‌ సర్టిఫికేషన్‌ ఆ తర్వాత ఇతర, ఆహారేతర ఉత్పత్తు లకు కూడా వ్యాపించడం మొదలుపెట్టింది.

హలాల్‌ సర్టిఫికేషన్‌ జారీ ప్రక్రియలో 3 ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా పాటించ వలసి ఉంటుంది. అవి.. 1. హలాల్‌ చేసే కసాయి మైనారిటీ (వయసు) తీరిన ముస్లిం వ్యక్తి అయి వుండాలి, 2. హలాల్‌ చేసే సమయంలో ‘‘బిల్స్మిల్లాప్‌ా, అల్లాప్‌ా అక్బర్‌’’ (దేవుడు పేరిట, అల్లాప్‌ా మాత్రమే దేవుడు) అని చెప్పాలి.  చెప్పక పోతే ఆ ఆహారపదార్ధాన్ని హలాల్‌గా పరిగణించరు, 3. హలాల్‌ చేస్తున్న సమయంలో వధించబడే జంతువు తల మక్కా దిశగా పెట్టాలి.

పైన పేర్కొన్న 3 ముఖ్య నియమాల్లో ఏది పాటించకపోయినా ఇస్లాం ప్రకారం అది హలాల్‌గా పరిగణిం చరు. ఇక ఆ తర్వాత ఆ జంతువుని ఏవిధంగా వధించాలి, మొదట ఏ భాగంలో ఖండిరచాలి వంటి ఇతర నిబంధనలు కూడా ఉన్నాయి.

ఇదంతా గమనిస్తే అర్ధమయ్యే విషయం ఏమిటంటే.. ఒక కంపెనీ తమ ఉత్పత్తులకు హలాల్‌ గుర్తింపు కోరుకున్నట్లైతే, ఆ కంపెనీ ప్రొడక్షన్‌ విభాగంలో పనిచేసే కార్మికులు తప్పని సరిగా ఇస్లాం మతానికి చెందినవారే అయి వుండాలి. ఇతర మతస్థుల శ్రమ ద్వారా జరిగే ఏవిధమైన ఉత్పత్తులకు హలాల్‌ గుర్తింపు రాదు. ఇది ఆర్ధిక జిహాద్‌ తప్ప మరొకటి కాదు. ఇది పూర్తి రాజ్యాంగ విరుద్ధమైన చర్య. హలాల్‌ గుర్తింపు కావాలి అంటే ఆయా సంస్థలకు కంపెనీలు సంవత్సరానికి సుమారు 21వేల రూపాయలు దాకా (ఉత్పత్తి చేసే వస్తువు బట్టి) చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా చెల్లించే డబ్బు దేశ వ్యతిరేక కార్యకలాపాల కోసం  వినియోగిస్తున్నారు.

హలాల్‌ గుర్తింపునిచ్చే సంస్థల్లో ముఖ్యమైన జమైత్‌ ఉలేమా-ఇ-హింద్‌ కార్యకలాపాలు గమనించినట్లయితే.. భారతదేశంలో ఎక్కడ ఏ ఉగ్రవాద దాడి జరిగినా అరెస్ట్‌ అయ్యే వ్యక్తులకు, ఉగ్రవాదులకు న్యాయపరమైన సహాయం చేసే సంస్థల్లో జమైత్‌ ఉలేమా ఇ-హింద్‌ ఎప్పుడూ ముందుంటుంది. పట్టుబడిన ఉగ్రవాది ఎంతటి దేశద్రోహానికి పాల్పడినా, ఎంతటి తీవ్రమైన నేరం చేసినా సరే.. అటువంటి వారికి న్యాయ సహాయం కోసం అయ్యే ఖర్చులు ఈ సంస్థ భరిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *