ఆర్థికస్వాతంత్య్రానికి హలాల్….
తమ ఉత్పత్తులు నూటికి నూరు శాతం ఇస్లామిక్ షరియా నిబంధనలను అనుసరించి ఉంటాయని, అందుకోసం ప్రత్యేకంగా ముస్లిం ఉద్యోగులతో కూడిన ‘అంతర్గత హలాల్ మేనేజ్మెంట్’ శాఖను ఏర్పాటు చేశామంటూ తమ హలాల్ పాలసీ గురించి ‘హిమాలయా’ కంపెనీ ప్రకటించ గానే దేశవ్యాప్తంగా ఆగ్రహంతో పాటు హలాల్ ఆహార పదార్ధాలపై చర్చ జరిగింది.
‘హలాల్’ సర్టిఫికేషన్ వెనుక కేవలం మతపర మైన నిబంధన మాత్రమే కాకుండా, ఆర్ధిక దృష్టికోణం కూడా ఉంది. 2013వ సంవత్సరంలో మలేషియాలో ‘ప్రపంచ హలాల్ ఉత్పత్తిదారుల ఫోరమ్ సమావేశం’ పేరిట ఒక సదస్సు జరిగింది. అందులో పాల్గొన్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్‌కో ఆపరేషన్ (ూIజ)కి చెందిన 57 ఇస్లామిక్ దేశాల ప్రతినిధులు అందరూ కలిసి ‘‘ఇస్లామేతర దేశాల నుండి దిగుమతి అయ్యే ఆహార పదార్ధాలు తప్పనిసరిగా ‘హలాల్’ గుర్తింపు కలిగి ఉండా ల్సిందే’’ అని ఒక తీర్మానం చేసుకున్నారు. ఇస్లామే తర దేశాల్లో ఆహార ఉత్పత్తులకు హలాల్ గుర్తింపు నిచ్చేవి ఇస్లామిక్ సంస్థలే కాబట్టి ఈ నిబంధన ఆయా దేశాల్లోని ఇస్లామిక్ సంస్థలకు ఆర్ధికంగా పనికొస్తుంది అనేది దీని వెనుక అసలు ఉద్దేశం.
సెక్యులర్ దేశమైన భారత్‌లోపై రెండు ప్రభుత్వ సంస్థలను కాదని, కేవలం మతం ఆధారంగా సర్టిఫికేషన్ జారీ చేసే మరో ప్రక్రియ కూడా ఉంది. అదే హలాల్ సర్టిఫికేషన్. ఇస్లామిక్ నిబంధనలను అనుసరించి హలాల్ చేసిన ఆహార ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇచ్చేందుకు కొన్ని ఇస్లామిక్ మతపర మైన సంస్థలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి.. జమియత్ ఉలేమా-ఇ-హింద్, జమియత్ ఉలేమా -ఇ-మహారాష్ట్ర, మరొకటి హలాల్ సర్టిఫికేషన్ ఇండియా సంస్థలు. ఇవన్నీ కూడా ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేని ప్రయివేట్ సంస్థలు.
ఆహార పదార్ధాలతో మొదలైన హలాల్ సర్టిఫికేషన్ ఆ తర్వాత ఇతర, ఆహారేతర ఉత్పత్తు లకు కూడా వ్యాపించడం మొదలుపెట్టింది. అలంకరణ (మేకప్) సామాగ్రి, సంగీత పరికరాలు వాడకంపై కఠినమైన ఆంక్షలు కలిగిన ఇస్లామిక్ దేశాలు, ఇప్పుడు వాటికి ‘హలాల్ సర్టిఫికేషన్’ ఉంటే మాత్రం తమ దేశంలోకి దిగుమతి చేసుకు నేందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పటంలేదు. దీని కారణంగా ఇప్పుడు ‘హలాల్ శాఖాహారం’, ‘హలాల చిరుతిళ్ళు’, దగ్గరి నుండి ‘హలాల్ కూల్ డ్రిరక్స్’, ‘హలాల్ కాటుక’, ‘హలాల్ టూత్-పేస్ట్’, ‘హలాల్ మేకప్ కిట్లు’, ‘హలాల్ నెయిల్ పాలిష్’ దాకా హలాల్ సర్టిఫికేషన్ విస్తరించింది.
ఈ హలాల్ సర్టిఫికేషన్ కేవలం ఇస్లామిక్ మతపరమైన సంస్థలకు ఆర్ధిక లాభాలు తెచ్చి పెట్టడమే కాదు, ఇది హిందూ కార్మికుల ఉపాధి అవకాశాలకు గొడ్డలిపెట్టు వంటిది. ఈ ఇస్లామిక్ సంస్థలు తమకున్న ‘గుర్తింపు అధికారం’తో ఏమి తినాలి, ఏమి తినవద్దు అని సూచించే స్థాయి నుండి ఇప్పడు ఏకంగా ‘హలాల్ హాస్పిటళ్లు’, ‘హలాల్ టూరిజం’, ‘హలాల్ గృహ సముదాయాలు’.. చెప్పుకుంటూ పొతే ఇలా ఎన్నో!
హలాల్ సర్టిఫికేషన్ జారీ ప్రక్రియలో 3 ముఖ్య మైన విషయాలు తప్పనిసరిగా పాటించ వలసి ఉంటుంది. అవి..
- హలాల్ చేసే కసాయి మైనారిటీ (వయసు) తీరిన ముస్లిం వ్యక్తి అయివుండాలి
- హలాల్ చేసే సమయంలో ‘‘బిల్స్మి ల్లాహ్, అల్లాహ్ అక్బర్’’ (దేవుడు పేరిట, అల్లాహ్ మాత్రమే దేవుడు) అని చెప్పాలి. ఇది చెప్పక పోతే ఆ ఆహార పదార్ధాన్ని హలాల్‌గా పరిగణించరు.
- హలాల్ చేస్తున్న సమయంలో వధించబడే జంతువు తల మక్కా దిశగా పెట్టాలి.
హలాల్ గుర్తింపు కావాలి అంటే ఆయా సంస్థలకు కంపెనీలు సంవత్సరానికి సుమారు 21వేల రూపాయలు దాకా (ఉత్పత్తి చేసే వస్తువు బట్టి) చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా చెల్లించే డబ్బు దేశ వ్యతిరేక కార్యకలాపాల కోసం ఏ విధంగా వినియోగింపబడుతోందో ఇప్పుడు గమనిద్దాం.
హలాల్ గుర్తింపునిచ్చే సంస్థల్లో ముఖ్యమైన జమైత్ ఉలేమా-ఇ-హింద్ కార్యకలాపాలు గమనించినట్లయితే.. భారతదేశంలో ఎక్కడ ఏ ఉగ్రవాద దాడి జరిగినా అరెస్ట్ అయ్యే వ్యక్తులకు, ఉగ్రవాదులకు న్యాయపరమైన సహాయం చేసే సంస్థల్లో జమైత్ ఉలేమా ఇ-హింద్ ఎప్పుడూ ముందుంటుంది. పట్టుబడిన ఉగ్రవాది ఎంతటి దేశద్రోహానికి పాల్పడినా, ఎంతటి తీవ్రమైన నేరం చేసినా సరే.. అటువంటి వారికి న్యాయ సహాయం కోసం అయ్యే ఖర్చులు ఈ సంస్థ భరిస్తుంది. మావోయిస్ట్‌ల కార్యకలాపాలనుపూర్తిగా అరికట్టడా నికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో అలాంటి కఠినమైన చర్యలు ఈ సమాంతర ఆర్ధిక వ్యవస్థను నడుపుతున్న సంస్థల పట్ల కూడా చేపట్టాలి.