“”హనుమద్యుతితప్రాణే.. జీవంతోపి వయంహతా:””

హనుమంతుడు అంటే బలవంతుడు. గొప్ప ధీశాలి. అత్యంత వినయవంతుడు. రామ భక్తులలో అగ్రేససుడు. ఓ దూత, రాయబారి, ముందు చూపున్నవాడు… ఇలా అన్ని రకాల గొప్ప లక్షణాలు హనుమంతునిలో వున్నాయి. అందుకే భవిష్యత్‌ బ్రహ్మ కానున్నారు. హనుమంతుడు ఎంత బలశాలి అయినా.. ఎక్కడా నిగ్రహం కోల్పోలేదు. తనకంటే పెద్దవారి ముందు అత్యంత వినయ విధేయలతోనే వున్నారు. ఎన్ని గొప్ప లక్షణాలతో ఆయన్ని పొడిగినా… రామభక్త అంటే హనుమంతుల వారు పొంగిపోతారు. తాను అత్యంత బలశాలి అయినా, శ్రీరామచంద్రుడే తన దగ్గర వున్నా… ఎక్కడా వినయ విధేయతల్లో మార్పు రాలేదు. అత్యంత సవధారణంగానే వున్నారు. అలాంటి గొప్ప నీతిని హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాలి.

ధైర్యం విషయంలో కూడా నేర్చుకోవాలి. శత్రువులతో పోరాడాల్సి వచ్చినపుడు హనుమంతుడు నిజమైన ధైర్యాన్ని చూపించాడు. తన కంటే అత్యంత బలవంతులైనా… ఎక్కడా ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. ఈ గొప్ప లక్షణాన్ని నేర్చుకోవాలి. తాను స్వతహాగా సర్వశక్తిససపన్నుడైనా… శ్రీరాముని దగ్గర మాత్రం అత్యంత జాగ్రత్తగా వుండేవారు. తనని తాను రాముడికి అర్పించుకున్న గొప్ప భక్తుడు ఆంజనేయుడు. అలాగే శ్రీరాముడు, సుగ్రీవునికి  మధ్య సంధి కుదర్చడంలోనూ హనుమంతుల వారిదే కీలక పాత్ర. ఇప్పటి తరానికి సరిపోయేట్లు చెప్పాలంటే రాయబారి. ఈ లక్షణాలను మనం కూడా ఉపాసన చేయాలి. అలాగే అత్యంత నిలకడ స్వభావంతో, ఓర్పుతో, నేర్పుతో సముద్రాన్ని దాటి, లంకను చేరాడు. ససతమ్మ వారి దర్శనం చేసఱకున్నాడు. తనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా… తనకిచ్చిన బాధ్యతను ఓర్పుతో ఓర్చుకొనే లక్షణం హనుమంతుల వారిది.

ఇక.. హనుమంతుల వారు ఎక్కడ వుంటారో అక్కడ ప్రాణాలు కూడా నిలబడతాయి. రుష్యమూక పర్వతం మీద వున్న సమయంలో  మారు వేషంలో వస్తున్న  రామలక్ష్మణులను చూసీ  సుగ్రీవుడు  పారిపోతాడు. అప్పుడు హనుమ… ఆయన్ని నిలవరిస్తాడు . రాజుగా వుండి ఇలా పారిపోవడమేంటి? అంటూ ప్రశ్నిస్టారు . వాలి పంపి వుంటాడు నన్ను చంపడానికి అని సుగ్రీవుడు అంటాడు. అప్పుడు హనుమంతుడు మారు వేషంలో వెళ్లి, వారెవరో తెలుసఱకుంటారు. ఆ తర్వాత సఱగ్రీవుడికి, రాముడికి మధ్య మైత్రీ చేయించారు. ఈ మైత్రీ జరిగింది కాబట్టి, సుగ్రీవుడికి  రాజ్యం వచ్చింది, సుగ్రీవుడికి  భార్య ఉమ ఆయనకి దక్కింది.

రెండో ఉదాహరణ : ఇంద్రజిత్తు ఓ రోజు భయంకర యుద్ధం చేసవ్తడు. అందులో కొన్ని కోట్ల మంది వానరుల్ని ఇంద్రజిత్తు బాణాలతో చంపేశాడు. కొన్ని లక్షల మందికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. రామలక్ష్మణులు కూడా మూర్ఛపోయారు. అప్పుడు కొందరు పెద్దవాడైన జాంబవంతుల వారి దగ్గరికి వెళ్లారు. అప్పుడు విభీషనుడు తాతా… కుశలమా? అని జాంబవంతుల వారిని అడుగుతారు. అప్పుడు వెంటనే విభీషణుడు హనుమ కుశలమా? అంటూ ప్రశ్నవేస్తాడు . అదేమీ ప్రశ్న వేసావు . రామలక్ష్మణుల గురించి కూడా అడగలేదేమీ? పొరపాటు పడ్డావా? అని అడిగారు. అప్పుడు జాంబవంతుడు… నేను పొరపాటేమీ పడలేదు. పూర్తి జాగరూకతతోనే అడుగుతున్నాను. ఎందుకంటే.. హనుమంతుడు ఒక్కడు ప్రాణాలతో వుంటే మనమందరం బతికినట్లే. “”హనుమద్యుతితప్రాణే.. జీవంతోపి వయంహతా:…”” ఆ హనుమ గానీ మరణించారా.. మనమందరం బతికున్నా.. మరణించినట్లే. ఒకవేళ మనమందరం చనిపోయినా… హనుమంతుడు ఒక్కడు బతికినా.. మనందర్నీ బతికించేస్తారు  అని అన్నారు. అప్పుడు హనుమంతుల వారు అత్యంత వినయంతో తాతా… హనుమ నీకు నమస్కరిస్తున్నాడు. .. అంటూ అత్యంత వినయంగా నమస్కరిస్తాడు.

-హనుమజ్జయంతి సందర్భంగా 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *