అరుణాచల్ ప్రదేశ్ లో 600 మందితో ‘‘హర్ ఘర్ తిరంగా’’ ర్యాలీ
అరుణాచల్ ప్రదేశ్ లోని మెంచుకా ప్రాంతంలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. భారత సైన్యం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), భారత వైమానిక దళం, ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా‘‘ హర్ ఘర్ తిరంగా’’ ర్యాలీని నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ర్యాలీ చేపట్టారు. చిన్నారులు, స్థానిక ప్రజలతో పాటు అందరూ కలిసి 600 మంది పాల్గొన్నారు. ఐకానిక్ మెన్చుకా గేట్ నుంచి మెన్చుకా అడ్వాన్సడ్ ల్యాండింగ్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ ముక్త కంఠంతో దేశభక్తికి సంబంధించిన నినాదాలిచ్చారు.
ఉత్కంఠతతో సాగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనడంతో అక్కడి ప్రాంతమంతా దేశభక్తితో నిండిపోయింది. త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ర్యాలీ అంతా అత్యంత అద్భుతంగా సాగింది. ఈ సందర్భంగా చిన్నారులందరూ స్థానిక ప్రజలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. దేశ వ్యాప్తంగా ‘‘హర్ ఘర్ తిరంగా’’ ను మరింత ప్రచారం చేయడానికి, కుటుంబాలను ప్రేరేపించారు.
ఈ కార్యక్రమం సరిహద్దు ప్రాంతంలోని సాయుధ దళాలకు మరియు స్థానిక సమాజానికి మధ్య ఉన్న బంధాన్ని సూచిస్తుంది, దేశభక్తికి భౌగోళికంగా లేదా ఇతరత్రా సరిహద్దులు లేవనే సందేశాన్ని బలోపేతం చేస్తుంది.