పెట్రోల్ లో ఇథనాల్ కలిపడంపై చెత్త ప్రచారాలు జరుగుతున్నాయి : కేంద్రం మండిపాటు

20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ పై కొంత కాలంగా జరుగుతున్న దుష్ప్రచారంపై కేంద్రం మండిపడింది. బయో ఇథనాల్ వల్ల ఆటోమోబైల్ ఇంజిన్లు దెబ్బతింటాయని పలువురు చేస్తున్న ప్రచారాలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ కొట్టిపారేశారు.ఇదో చెత్తవాదన అని విరుచుకుపడ్డారు. ఈ20 ఇంధనం పర్యావరణంగా ఉపయోగించడతానికి అత్యంత సురక్షితమని ప్రకటించారు. అయితే దీర్ఘకాలంలో పాత వాహనాల్లో గ్యాస్కెట్లు, ఇంధన రబ్బరు గొట్టాలు, పైపులను మార్చాల్సి రావొచ్చని, అది అత్యంత సాధారణమని పేర్కొన్నారు. పలువురు ఉద్దేశపూర్వకంగానే ఇథనాల్ తో సమస్యలు వచ్చే అవకాశం వుందని ప్రజల్లో తప్పుడు భయాలను రేపుతున్నారని మంత్రి మండిపడ్డారు. పెట్రోల్ తో పోలిస్తే ఇథనాల్ ఎనర్జీ డెన్సిటీ కొంత మేర తక్కువ వుండటంతో మైలేజీలో తగ్గుదల వున్నప్పటికీ.. అది అత్యంత స్వల్పమేనని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *