బోర్ ‘‘రీచార్జ్ మ్యాన్”… ‘‘ట్విన్ రింగ్ మెథడ్’’ లో భగీరథుడు అయిన సక్సెస్ స్టోరీ
కాలం మారింది. ట్రెండు కూడా మారిపోయింది. ఎంత ట్రెండు మారినా, కాలం మారినా.. మనిషి ప్రకృతిపై ఆధారపడాల్సిందే. లక్షాధికారైన లవణమన్నమే కానీ.. మెరుగు బంగారంబు మింగబోడు అన్నట్లు… ప్రకృతిపై ఆధారపడాల్సిందే. మనిషి బ్రతుకుకి నీరు ప్రాణాధారం. దీనిని గుర్తించాడు కర్నాటక కొప్పల్‌కి చెందిన మీరా నాయక్. ఎక్కడ బోర్ వెల్ పాడైతే… అక్కడ ఆ బోర్‌వెల్‌ను బాగు చేయించడమే ఆయన పని. ఒక విధంగా బోర్‌వెల్‌కి ‘‘రీచార్జ్’’ చేస్తున్నట్లు లెక్క. దీనినే మహా యజ్ఞంలా తీసుకున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో మరింత శ్రద్ధగా చేస్తున్నాడు. యేడాదిన్నర కాలంలోనే 30 పాఠశాలల్లో పాడైన బోర్లను బాగు చేయించడం, కొత్తవి వేయించడం చేశాడు. ‘‘సంకల్ప రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ’’ కూడా అచ్చు ఇలాంటి పనే చేస్తోంది. కొంత మంది రైతులు ఈ సంస్థతో లాభపడ్డారు కూడా. అయితే.. ప్రస్తుతం అవి ఎండిపోయాయి. దీంతో సికందర్ మీర్‌నాయక్ మరో కంపెనీని సంప్రదించి, సీఎస్‌ఆర్ నిధుల కింద, కొప్పల్‌లోని అవసరం వున్న వారందరికీ ఉచితంగా బోర్లు వేయించాడు. ముఖ్యంగా పాఠశాలల కేంద్రంగా ఈ పని బాగా జరిగింది.
ఈ ప్రాంతంలోని చాలా పాఠశాలల్లో బోర్‌వెల్‌ను మరమ్మతులు చేయించడానికి ప్రభుత్వ సహాయం అర్జించిన సందర్భాలు చాలానే వున్నాయని స్థానికులు చెబుతుంటారు. కానీ.. పట్టించుకున్న నాథుడే లేడు. ఇప్పుడు ఎండా కాలం కారణంగా బావులు కూడా ఎండిపోయాయి. గత రెండు సంవత్సరాలుగా రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి ట్యాంకర్లను వాడుతున్నారు. మరి కొందరి పంటలు ఎండిపోయాయి కూడా. దీంతో సికందర్ మనస్సుకి రుచించలేదు. వెంటనే కొప్పల్‌లోని ‘‘ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు’’ ని సంప్రదించాడు. పాఠశాలల దైన్యాన్ని, రైతుల దీన పరిసస్థతిని వివరించాడు. వెంటనే ఆ వెంచర్ 10,000 మంది విద్యార్థులకు సహాయం చేససంది. అందరూ ససకందర్ పైనే ఆశలు పెట్టుకున్నారు.
దీంతో ససకిందర్ ‘‘ట్విన్ రింగ్ మెథడ్’’ని అవలంబించడం ప్రారంభించాడు. అంటే వర్షపు నీటిని ఎండాకాలం కోసం పొదుపు చేయడమే ఈ పద్ధతి. ఈ పద్ధతి ద్వారా కొప్పాల్‌లోని చాలా పాఠశాలలు, వ్యవసవయ భూములు బాగయ్యాయి. చాలా మంది పాఠశాల యాజమాన్యాలు సికిందర్ ని బాగా మెచ్చుకున్నాయి. దీనికి సహకరించిన సంకల్ప సిటీ కి , ఫిన్‌కేర్ బ్యాంకుకి, చాలా ధన్యవాదాలు ప్రకటించారు. వీరందరి చొరవ వల్ల 30 పాఠశాలల బోర్‌వెల్స్, 10 మంది రైతుల వ్యవసవయ క్షేత్రాలు సుభిక్షమయ్యాయి. ఒక్కసవరి బోర్‌వెల్‌ను ‘‘రీచార్జి’’ చేసశ్తీ నడిచిపోతుంది.
వర్షాకాల సమయంలో నీటిని అరికట్టేందుకు బోర్‌వెల్ సమీపంలోనే 20ft x 15ft x 8ft అడుగుల కొలమానంతో ఓ చెరువు లాంటిది నిర్మించాలి. ఎర్త్‌మూవర్‌ని ఉపయోగించి బోర్‌వెల్ కేసింగ్ , చుట్టూ 6ft x 4ft x 8ft దానిని వడపోత పదార్థంతో కప్పాలి. సస్లట్‌లు కేససంగ్‌లో కట్ చేసీ, నైలాన్ మెష్ తో చుట్టి, దాని చుట్టూ 6 అడుగుల ….. దాని చుట్టూ 3 అడుగుల సిమెంట్ రింగులు వుంచాలి.
మొదటి గోయ్యిని ను 20 మి.మీ. రాళ్లతో నింపబడి, ఓ ట్యాంక్ లాంటిది వుంచాలి. దానిని నింపి వుంచాలి. మొదటి దాని నుంచి 3 అంగుళాల ఫీడర్ వైపు ఖాళీగా వున్న లోయ లాంటి బావిని మొదటి ససమెంట్ రింగ్‌కి కలుపుతుంది. దీంతో వర్షాకాలంలో దాని నుంచి నీరు మొదటి బావి ద్వారా ప్రవహిస్తుంది . ఎండా కాలం లో నిల్వ కోసం కేససంగ్ ససట్ల ద్వారా వీటిల్లోకి నీరు ప్రవహించి, నిల్వ వుంటుంది. ఇలా సికందర్ మీర్‌నాయక్ అందరి దాహాన్ని తీర్చాడు.