పేదలకి నిస్వార్థ సేవ సేవ చేస్తున్న వైద్యుడికి నక్సలైట్ల బెదిరింపులు.. పద్మ శ్రీ వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటన
వైద్యం ద్వారా ప్రజా సేవ చేస్తున్న వైద్యుడి సేవలను కూడా నగ్జలైట్లు తట్టుకోలేకపోతున్నారు. బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా… సంప్రదాయ వైద్య అభ్యాసకుడు హేమచంద్ మాన్ ఝీకి నగ్జలైట్ల నుంచి బెదిరింపులు వచ్చాయి. నగ్జలైట్ల నుంచి బెదిరింపులు రావడంతో తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్లు ఆయన ప్రకటన చేశారు. అంతేకాకుండా నగ్జలైట్ల బెదిరింపు కారణంగా వైద్య వృత్తిని కూడా వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు. మాంఫీు చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారు. నగ్జలైట్ల ప్రాబల్యం అత్యధికంగా వుండే బస్తర్, నారాయణపూర్ జిల్లాల్లో ఆయన పేద ప్రజలకు వైద్య సేవలు ఉచితంగా అందిస్తుంటారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా హేమచంద్ మాన్ ఝీకి పద్మశ్రీ అవార్డును బహూకరించారు. ఆదివారం అర్ధరాత్రి నగ్జలైట్లు చమేలీ, గౌర్దండ్ గ్రామాల్లో నిర్మాణంలో వున్న రెండు మొబైల్ టవర్లను తగులబెట్టారు. అలాగే బెదిరిస్తూ… బ్యానర్లను, కరపత్రాలను అతికించారు. ఆ కర పత్రాలలో ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అందుకుంటున్న ఫొటో వుంది. అయితే ఛోటేడోంగర్‌లోని ఆమదై ఘాటి ఇనుప ఖనిజం ప్రాజెక్టు విషయంలో మాంరీaకి ముడుపులు అందాయని, వాటిని ఆయన తీసుకున్నట్లు నగ్జలైట్లు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. అయితే మాంరీa ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిరచారు. ఆ గనితో తనకు ఎలాంటి ప్రమేయం లేదని తేల్చి చెప్పారు.