విద్యాసంస్థల్లో హిజాబ్‌ నిషేధాన్ని సమర్ధించిన కర్ణాటక హైకోర్టు

విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్‌లను కర్ణాటక హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. హిజాబ్‌ ధరించడం ఇస్లాం ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్‌ అవస్థి, జస్టిస్‌ కృష్ణ ఎస్‌ దీక్షిత్‌, జస్టిస్‌ జేఎం ఖాజీలతో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి 5నాటి ప్రభుత్వ ఉత్త ర్వును చెల్లుబాటయ్యేలా కేసు పెట్టలేదని పేర్కొంది.

ఈ ఏడాది జనవరిలో ఉడిపిలోని ప్రభుత్వ పీయూ కళాశాలలో హిజాబ్‌ ధరించిన ఆరుగురు బాలికలను లోనికి రానీయకుండా నిషేధించడంతో హిజాబ్‌ వివాదం చెలరేగింది. దీంతో కాలేజీలో ప్రవేశం నిరాకరించడంపై బాలికలు కళాశాల బయట కూర్చొని నిరసనకు దిగారు. ఆ తర్వాత ఉడిపిలోని అనేక కళాశాలల అబ్బాయిలు కాషాయ కండువాలు ధరించి తరగతులకు హాజరు కావడం ప్రారంభించారు. ఈ నిరసన రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించింది. ఇది కర్ణాటకలోని అనేక చోట్ల నిరసనలు, ఆందోళనలకు దారితీసింది. ఈ మొత్తం వివాదాన్ని పిఎఫ్‌ఐ ఉగ్రవాద సంస్థ అనుబంధ సంస్థ అయిన ఎస్‌.డి.పి.ఐ ప్రేరేపించి, మత కల్లోలాలను సృష్టించడానికి అనేక ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో హర్ష అనే హిందూ యువకుడు కూడా దారుణ హత్యకు గురయ్యాడు.

ఫలితంగా, కర్ణాటక ప్రభుత్వం విద్యార్థు లందరూ తప్పనిసరిగా యూనిఫాం మాత్రమే ధరించి రావాలని, అలాగే నిపుణుల కమిటీ ఈ అంశంపై నిర్ణయం తీసుకునే వరకు హిజాబ్‌, కాషాయ కండువాలు రెండిరటినీ నిషేధించింది. ఫిబ్రవరి 5న, ప్రీ-యూనివర్శిటీ ఎడ్యుకేషన్‌ బోర్డు ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది. విద్యార్థులు పాఠశాల అడ్మినిస్ట్రేషన్‌ ఆమోదించిన యూనిఫాం మాత్రమే ధరించాలని, ఇతర మతపరమైన దుస్తులు కాలేజీలలోకి అనుమతి లేదని సర్క్యలర్‌లో పేర్కొంది. మేనేజ్‌మెంట్‌ కమిటీలు యూనిఫాంను సూచించని పక్షంలో, విద్యార్థులు సమానత్వం, ఐక్యత ఆలోచనతో కూడిన దుస్తులు ధరించాలని, సామాజిక వ్యవస్థకు భంగం కలగకుండా ఉండా లని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఇదిలా ఉండగా మరోవైపు విద్యా సంస్థల్లో హిజాబ్‌ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కొందరు బాలికలు కర్ణాటక హైకోర్టులో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేశారు.

  హిజాబ్‌ కేసుకు సంబంధించిన విచారణలు ఫిబ్రవరి 25న ముగియగా, కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. మార్చి 15 జరిగిన విచారణలో హైకోర్టు ఆ పిటిషన్లు కొట్టివేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *