సాధారణ రైతే.. అసాధారణ ప్రయోగంతో ’’పద్మశ్రీ’’

ఆపిల్ సాగు చేస్తున్న ఓ రైతుకి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు వరించింది. దీంతో ఆ రైతు దేశమంతటికీ పరిచయం అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ కి చెందిన హరిమన్ శర్మ దార్శనిక రైతు. ఆపిల్ పండ్ల తోటలను మంచు కొండల మీద నుంచి మైదానంలోకి తీసుకొచ్చి, పండించి, సక్సెస్ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ లోని గల్లసిన్ గ్రామంలో 1956 లో పుట్టారు. చాలా కష్టపడుతూ వ్యవసాయం చేస్తూ వచ్చారు. అయినా… వ్యవసాయంలో కొత్త కొత్త పద్ధతులను సృష్టించాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. హిమాచల్ ప్రదేశ్ లో 1992 ప్రాంతంలో పడిన విపరీతమైన మంచు వల్ల మామిడి చెట్లు సర్వనాశనం అయ్యాయి. దీంతో ఆపిల్ సాగు చేయాలని భావించారు హరిమన్ శర్మ. అయితే… చల్లగా వుండే కొండ ప్రాంతాల్లోనే యాపిల్ పంట వస్తుందని ఆయనకు ప్రాథమిక అవగాహన వుంది.

అయినా… తమ ప్రాంతంలో వాటికి ఎందుకు పండించకూడదన్న ఆలోచన వచ్చింది. దీంతో హారిమన్ శర్మ ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. పట్టు విడవకుండా పనిచేస్తూ… సముద్ర తలం నుంచి 700 మీటర్ల ఎత్తులోని మైదాన ప్రాంతాల్లో, అదీ వేసవిలో 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే వాతావరణంల కూడా, ఆపిల్ పండ్లను సాగు చేశారు. ఈ కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే తనకు పద్మశ్రీ దక్కిందని శర్మ పేర్కొన్నారు.

‘‘పద్మశ్రీ అనే అవార్డు ప్రతిష్ఠాత్మకమైనదే. కానీ.. అది ఎలా వస్తుందో నాకు తెలియదు. నేను వ్యవసాయదారుడిని కానీ 1999లో బిలాస్‌పూర్ జిల్లాలోని పనియాలా గ్రామంలోని నా ఇంటి పెరట్లో హెచ్‌ఆర్‌ఎంఎన్-99 రకాన్ని అభివృద్ధి చేయవలసి వచ్చింది. ఇంట్లోకి తెచ్చుకున్న కొన్ని ఆపిల్ విత్తనాలను ఊరికే విసిరాను. కొన్ని రోజుల తర్వాత ఓ గింజ మొక్కగా పెరగడం నాకు కనిపించింది. ఇదే కీలక మలుపు. దీంతో మరింత లోతుగా పనిచేయడం ప్రారంభించా. 2001 నాటికి 1,800 అడుగుల ఎత్తులో వున్న పనియాలా వెచ్చని వాతావరణంలోనూ మొక్క ఫలాలనిచ్చింది. దీంతో తల్లి మొక్కను జాగ్రత్తగా చూసుకున్నా. దానిని అంటుకట్టుట ద్వారా తోటనే ప్రారంభించాను’’ అని హారిమన్ శర్మ పేర్కొన్నారు.

HRMN-99 రకం దాని చారల ఎరుపు-పైగా పసుపు చర్మం, మృదువైన మరియు జ్యుసి గుజ్జు మరియు ప్రతి మొక్కకు సంవత్సరానికి 75 కిలోల వరకు పండ్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని వివరించారు. 2000 సంవత్సరానికి పూర్వం భూమిలోని రాళ్లను పగలగొట్టే పని, అలాగే కూరగాయల సాగు చేస్తుండేవాడినని తెలిపారు. స్థానికంగా వుండే వ్యవసాయ శాస్త్రవేత్త పీఎల్ గౌతమ్ హారిమన్ శర్మ సామర్థ్యం, శ్రద్ధ గుర్తంచారు. కొత్త యాపిల్ రకాన్ని అభివృద్ధి చేయమని ప్రోత్సహించారు. దానికి తగ్గుట్టుగా సూచనలు, సలహాలు కూడా చేస్తూ వచ్చారు. అంతేకాకుండా నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (NIF)కి అనుసంధానం కూడా చేశారు. దీంతో తన ధైర్యం మరింత పెరిగి, ముందుకు సాగానని శర్మ వెల్లడించారు.తక్కువ ఎత్తులో పెరిగిన నిర్దిష్ట ఆపిల్ జాతులకు పేటెంట్ పొందడానికి నాకు కనీసం ఎనిమిది సంవత్సరాలు పట్టిందని పేర్కొన్నారు.

పేటెంట్ కోసం 2014లో దరఖాస్తు చేసి, 2022లో అందుకున్నారు. HRMN-99 అనేది నా పేరు యొక్క సంక్షిప్త రూపం. ఈ రోజు, నేను మా గ్రామానికి సమీపంలో నా స్వంత నర్సరీని నడుపుతున్నానని తెలిపారు. హారీమన్ శర్మ చేస్తున్న కృషిని అప్పటి ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ దృష్టికి కూడ వెళ్లింది. దీంతో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ రకం ఆపిల్ పండ్లు తెలుగు రాష్ట్రాలతో పాటు 29 రాష్ట్రాల్లో దొరుకుతున్నాయి. అలాగే బంగ్లాదేశ్, నేపాల్, జర్మనీలోనూ సాగు చేస్తున్నారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ జాతీయ పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కూడా అందుకున్నారు. ఇప్పుడు పద్మశ్రీ రావడంతో ఈ రైతు మరింత ప్రాచుర్యంలోకి వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *