బంగ్లాదేశ్ హింసను నిరసిస్తూ హైదరాబాద్ లో ’’హిందూ ఆక్రోశ్ ర్యాలీ’’
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హైదరాబాద్ లో హిందువులు అతిపెద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కోఠి నుంచి సుల్తాన్ బజార్ చౌర్తా, రాంకోఠిల మీదుగా కాచిగూడ చౌరస్తాలోని వీరసావర్కర్ చౌక్ వరకు ఈ హిందూ ఆక్రోశ్ ర్యాలీ సాగింది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలు వెంటనే ఆపేలా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ దాడులను తక్షణమే ఆపాలని నినాదాలు కూడా చేశారు. హిందువులు నిర్వహించిన ఈ ర్యాలీకి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ మతోన్మాదులను, ఛాందసులను రెచ్చగొడుతోందని మండిపడ్డారు. ఇలా రెచ్చగొడుతూ.. అక్కడి ప్రభుత్వంపై కాకుండా అక్కడి హిందువులపై దాడులకు పాక్ ప్రభుత్వం ప్రేరేపిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అక్కడి హిందువులపై దాడులను ఆపకపోతే.. తదుపరి జరిగే పరిణామాలకు పాకిస్తానే బాధ్యత వహించాల్సి వుంటుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.