HSS ఆధ్వర్యంలో ఉంగాడాలో ‘‘హిందూ పరివార్ శిబిర్’’

హిందూ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఉంగాడాలో నాలుగు రోజుల పాుట హిందూ పరివార్ శిబిరం నిర్వహించారు. ఏప్రిల్ 3నుంచి ఏప్రిల్ 6 వరకు శ్రీ సహజానంద స్కూల్, బుకోటో, కంపాలాలో ఈ శిబిరం జరిగింది.ఈ శిబిరంలో 9 మంది స్వయంసేవకులు, 26 మంది సేవికలు, 4 బాలురు, 7 మంది బాలికలతో కలిసి మొత్తం 46 మంది పాల్గొన్నారు. ఏప్రిల్ 3న సంప్రదాయబద్ధంగా గాయత్రీ హోమంతో ఈ శిబిరం ప్రారంభమైంది.
నాలుగు రోజుల పాటు జరిగిన ఈ శిబిరిలో శారీరిక అంశాలు, బౌద్ధిక అంశాలతో పాటు చర్చలు, క్రమశిక్షణతో పాటు మరికొన్ని కార్యక్రమాలు జరిగాయి. ఇందులో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి రోజూ ఈశ్ చింతన, ఓంకారంతో ప్రారంభమైంది. ఇది ఆధ్యాత్మిక చింతనకు కూడా తోడ్పడింది. అలాగే యోగా సెషన్స్, సంఘ స్థాన్, శక్తిని, శారీరక క్రమశిక్షణను తీసుకొచ్చాయి. బౌద్ధిక్ అంశాల ద్వారా ధర్మం, కుటుంబ విలవలు, సామాజిక బాధ్యతలపై మరింత లోతైన అవగాహనను పెంచాయి.
అలాగే బృంద చర్చల్లో భాగంగా కుటుంబ బంధాలను బలపర్చుకోవడం, క్రమశిక్షణతో జీవించడం, సమాజానికి తోడ్పడటం వంటి అంశాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.నిస్వార్థ సేవ చేయడం, భిన్నత్వంలో ఏకత్వం, సమాజ నిర్మాణంలో పాత్ర, కుటుంబం లాంటి అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. సంఘ్ మొత్తం కూడా ఓ కుటుంబం అనే భావన తెచ్చేలా అక్కడి కార్యక్రమాలను రూపొందించారు.
ఇక.. ఏప్రిల్ 6 న తల్లిదండ్రులను, ప్రతిష్ఠిత వ్యక్తులను ఆహ్వానించి, సామూహిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొన్న వారు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ప్రదర్శనలు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఏప్రిల్ 6న దీక్షాంత్‌తో శిబిరం ముగిసింది, దీంతో శిబిరం విజయవంతంగా పూర్తయింది. పాల్గొన్నవారు నూతన లక్ష్య స్ఫూర్తితో, బలమైన కుటుంబ బంధాలతో, మరియు నేర్చుకున్న విలువలను ఆచరించాలనే నిబద్ధతతో తిరిగి వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *