జనాభాలో హిందువుల శాతం తగ్గుదల.. కీలక విషయం బయటపెట్టిన పీఎం ఆర్ధిక మండలి
ప్రధాన మంత్రి ఆర్థిక మండలి కీలక విషయం బయటపెట్టింది. భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందంటూ పేర్కొంది. 1950 లో మన దేశంలో 84.68శాతంగా వుండగా… 2015 నాటికి 78.06శాతానికి క్షీణించిందని వెల్లడిరచింది. ఇదే ససయంలో ముస్లిమ్ జనాభా పెరుగుతోందని పేర్కొంది. 9.84 శాతం నుంచి 14.09 శాతానికి పెరిగిందని అంటే… ఏకంగా 43 శాతం మేర ముసస్లం జనాభా పెరిగిందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 167 దేశాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను సలహా మండలి పొందుపరించింది. ఈ నివేదిక ప్రకారం హిందువులు, పార్శీలు, జైనుల జనాభా శాతం తగ్గుతుంటే.. బౌద్ధులు, క్రిస్టియన్లు, సిక్కుల శాతం పెరిగింది. 38 ఇస్లామిక్ దేశాల్లో మెజారిటీ మతస్తుల సంఖ్య పెరిగితే… మన భారత్‌లో మాత్రం మెజారిటీ మతస్తుల సంఖ్య తగ్గినట్లు నివేదిక వెల్లడించింది.
అత్యధికంగా మయన్మార్‌లో హిందువుల జనాభా 10 శాతం క్షీణించగా, 7.82 శాతంతో భారత్ రెండో స్థానంలో నిలిచింది. హిందూ దేశమైన నేపాల్‌లో వారి సంఖ్య 3.6 శాతం తగ్గింది. మైనారిటీ రక్షణ, అభివృద్ధి భారత్‌లో పెరిగినట్లు ఈ నివేదిక సూచించింది. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ జనాభా వాటా 123 దేశాల్లో తగ్గిందని, కేవలం 44 దేశాల్లో మాత్రమే మెజారిటీ జనాభా పెరిగినట్లు తెలిపింది. ఈ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్, పాక్, శ్రీలంక, భూటాన్, ఆఫ్గనిస్నాన వంటి భారత పొరుగు దేశాల్లో మాత్రం మెజారిటీ మతస్తుల వాటా పెరుగుతోంది. ‘‘షేర్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీస్’’ పేరుతో ఈ నివేదిక వచ్చింది. భారత్‌లో జైనుల జనాభా 1950 లో 0.45 శాతం నుంచి 2015లో 0.36 శాతానికి తగ్గింది. ఇక క్రిస్టియన్ జనాభా 1950 లో 2.24 శాతం నుంచి 2015 లో 2.36 శాతానికి పెరిగింది. ఇక సిక్కుల జనాభా 1950 లో 1.24 శాతం వుండగా… 2015 లో 1.85 శాతంగా వుంది. జైనులు 1950 లో 0.45 శాతం వుండగా.. .2015 లో 0.36 శాతానికి పడిపోయింది. అంటే 20 శాతం తగ్గుదల కనిపిస్తోంది.