సిడ్నీలో సంస్కృతంలో వాల్మీకి రామాయణ కథన రూప ప్రదర్శన

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లోని సిడ్నీలో ఉన్న VHP సంస్కృత పాఠశాల యువ విద్యార్థులు, వాల్మీకి రామాయణంలోని ఆరు కాండాలను సంస్కృతం భాషలో పూర్తిగా కథనరూపకంగా ప్రదర్శించడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఈ అపూర్వమైన సాంస్కృతిక కార్యక్రమం సిడ్నీలోని ది రీజెన్సీ ఫంక్షన్ సెంటర్‌లో జరిగిన పాఠశాల వార్షికోత్సవ వేడుకల సందర్భంగా జరిగింది.
పదిహేను సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 200 మందికి పైగా విద్యార్థులు అద్భుతమైన అంకితభావం , క్రమశిక్షణతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంస్థకు అక్కడ ఆరు బ్రాంచీలు ఉన్నాయ. ఈ ఆరు శాఖలతో, వారు వాల్మీకి రామాయణంలోని ఆరు గొప్ప కాండలను పూర్తిగా సంస్కృతంలో ప్రదర్శించారు. విద్యార్థులు చేసిన ఈ ప్రతిభావంతమైన ప్రదర్శనకుగానూ ఆస్ట్రేలియా ప్రభుత్వంలోని న్యూ సౌత్ వేల్స్ విద్యా శాఖ కమ్యూనిటీ భాషా పాఠశాలల నుండి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించింది. VHP సంస్కృత పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.
VHP సంస్కృత పాఠశాల సమన్వయకర్త చ VHP ఆస్ట్రేలియా జాతీయ ప్రధాన కార్యదర్శి అఖిల రామరతినం విద్యార్థుల విజయాల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు: “ఆస్ట్రేలియాలో కూడా మన యువ తరం మన పూర్వీకుల సంపదను, మనధర్మాన్ని కాపాడుతూ ముందుకు తీసుకువెళుతుండటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ విజయం ఒక భక్తికి, మన సాంస్కృతిక వారసత్వానికి ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు”అంటూ పేర్కొన్నారు.
VHP ఆస్ట్రేలియాలోని ఒక విభాగమైన VHP సంస్కృత పాఠశాల, న్యూ సౌత్ వేల్స్ విద్యా శాఖచే సంస్కృతం కోసం కమ్యూనిటీ లాంగ్వేజ్ స్కూల్‌గా అధికారికంగా గుర్తింపు పొందింది. ది పాండ్స్, కార్లింగ్‌ఫోర్డ్, హోమ్‌బుష్, నువర్రా, టూంగాబ్బీ మరియు వైతారా అనే ఆరు కేంద్రాలతో, ఈ పాఠశాల యువతలో సంస్కృత అభ్యాసం సాంస్కృతిక విలువలను పెంపొందించే తన లక్ష్యాన్ని కొనసాగిస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *