జుక్కల్ లో హిందూ దేవాలయంపై దాడి…

తెలంగాణలో హిందూ దేవాలయాల విధ్వంసం జరుగుతూనే వుంది. మొన్నటికి మొన్న శంషాబాద్ ఆంజనేయ స్వామి విధ్వంసం మరిచిపోకముందే జుక్కల్ లో మరో దేవాలయంపై దాడి జరిగింది. పది మంది వ్యక్తులు దేవాలయంపై దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. ఈ బృందం సోమయ్య, చౌడమ్మ, పోచమ్మ ఆలయాల్లోని విగ్రహాలను అపవిత్రం చేసి, దేవతలను అపవిత్రం చేసి, వారి వస్త్రాలను విప్పి, విగ్రహాలను ధ్వంసం చేశారు. దీంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. దాడి చేసిన దుండగుల్లో ఒకర్ని పట్టుకున్నారు. మరో తొమ్మిది మంది ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. దీంతో పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వ్యక్తి ముస్లిం అయి వుంటాడని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో పట్టుబడిన వ్యక్తి పారిపోడానికి ప్రయత్నించాడు. కానీ తర్వాత తన నేరాన్ని అంగీకరించాడు.
మరోవైపు విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అమ్మ వారికి చీరను సమర్పించారు.వరుస ఘటనలు చూస్తుంటే ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవేవీ యాదృచ్ఛికమని కొట్టిపారేయలేమని, దాడులను కొందరు ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రభుత్వ అలసత్వం వల్ల మరింత రెచ్చిపోతున్నారాని, అనాలోచితంగా ప్రోత్సహిస్తున్నారా? లేదా? మరేమైనా వుందా? అని ప్రశ్నించారు.జుక్కల్ దేవాలయ ధ్వంసం కేసులో నిందితులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *