ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాలపై దాడులు… విగ్రహాలు ధ్వంసం
ఆస్ట్రేలియాలోని రెండు హిందూ దేవాలయాలపై దుండగులు దాడి చేశారు. ఛాందసులు దోపిడీకి కూడా పాల్పడ్డారు. అయితే మొత్తం నలుగురు తమ మొహాలకు నలుపు రంగు వస్త్రాలు చుట్టుకొని ఈ విధ్వంసం సృష్టించారు. ముందు దేవాలయం తలుపులను బద్దలు కొట్టారు, ఆ తర్వాత హుండీలను పగులగొట్టారు.
ఈ హుండీల్లో డబ్బులున్నాయి. ఈ దేవాలయ విధ్వంసం తమనెంతో కలవర పెట్టిందని, చాలా బాధపడుతున్నామని హిందూ దేవాలయాల బాధ్యులు తరుణ్ అగస్తీ అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనికి తాము కూడా సహకరిస్తామన్నారు. మత ఛాందసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, హిందువుల ఆత్మగౌరవం, హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీయడమే అవుతుందని, సామరస్యం కూడా దెబ్బతింటుందన్నారు.
ఈ దేవాలయం తర్వాత కాన్ బెర్రాలోని శ్రీవిష్ణు శివ మందిరంపై కూడా దుండగులు దాడి చేశారు. ఈ దేవాలయంలో కూడా దుండగులు హుండీలను ధ్వంసం చేసి, అందులోని నగదును ఎత్తుకెళ్లారు. శివలింగాన్ని ధ్వంసం చేయడంతో పాటు దేవాలయ అల్మారాలోని దేవతలను వస్త్రాలను కూడా చిందర వందర చేసేశారు. హిందూ దేవాలయాలకు ప్రభుత్వం భద్రత కల్పించాలని అక్కడి హిందువులు డిమాండ్ చేశారు.