బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కలకత్తాలో హిందువుల భారీ నిరసన

బంగ్లాదేశ్ లోని హిందువులపై ఇస్లామిక్ ఛాందసవాదులు చేస్తున్న హింసాకాండను నిరసిస్తూ కోలకతాలో హిందువులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జాదవ్ పూర్ లో హిందువులందరూ రోడ్డెక్కి నిరసనకు దిగారు. బంగ్లాదేశ్ లోని హిందువులకు రక్షణ కల్పించాలని మానవహారాన్ని ఏర్పాటు చేశారు. అలాగే కొవ్వొత్తులను వెలిగించి, తమ నిరసనను వ్యక్తం చేశారు. అయితే జాదవ్ పూర్ లోనే వుండే జాదవ్ పూర్ విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థి సంఘాలు గానీ, ప్రొఫెసర్లు గానీ ఎవ్వరూ ఈ నిరసనలో పాల్గొనలేదు.
ఎందుకంటే.. ప్రతిసారీ మానవ హక్కులు, పౌర హక్కులంటూ వామపక్ష ఎజెండాను తమ భుజాలకెత్తుకునే ఈ ఫ్రొఫెసర్లు హిందువులకు మాత్రం తమ మద్దతివ్వలేదన్న విషయాన్ని మనమందరమూ గమనించాల్సిన అంశం. ఈ సందర్భంగా నిరసనలో పాల్గొన్న వారు వెంటనే బంగ్లాలో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని తక్షణమే నిరోధించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందువులపై ఇంత దారుణాలు జరుగుతున్నా.. సీపీఎం, కాంగ్రెస్, టీఎంసీ వంటి రాజకీయ పక్షాలు మౌనంగా ఎందుకున్నాయంటూ సూటిగా నిలదీశారు.బంగ్లాదేశ్ నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి హిందువులు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి తగిన ఏర్పాట్లు కూడా చేయాలని వీరు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *