30 ఏళ్ల తర్వాత పుల్వామలో తెరుచుకున్న ఆలయం… ఆనందం వ్యక్తం చేసిన పండిట్లు
జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో 30 ఏళ్ల తర్వాత చారిత్రక ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. మురాన్ గ్రామంలోని బరారీ మౌజ్ ఆలయంలో ఈ సందర్భంగా కశ్మీరీ పండిట్లు పూజలు, హోమాలు చేశారు. కశ్మీరీ పండితులు, ముస్లింలు కలిసి ఆలయ తలుపులు తెరిచారు. అలాగే హోమ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మూడు దశాబ్దాల తర్వాత తమ ఆలయం తెరుచుకుందని, తమకు సంతోషంగా వుందన్నారు. కశ్మీరీ పండిట్ బోధరాజ్ భట్ మాట్లాడుతూ.. ఆలయం తెరుచుకోబోతోందన్న విషయం తెలుసుకొని, తాను ఢల్లీి నుంచి వచ్చానని, హోమం, పూజల్లో పాల్గొన్నానని, ఆనందంగా వుందన్నారు. 1990లో లోయ విడిచి వెళ్లానని, ఇప్పుడు తిరిగి వచ్చినట్లు తెలిపారు.