చరిత్ర పాఠాలు నేర్చుకోవాలి
వేల సంవత్సరాలుగా ఏ విధమైన బాధ లేకుండా మనం జాతీయ జీవనాన్ని సాగిస్తూ వచ్చాం. అలా మన ఉనికిని, సామర్ధ్యాన్ని నిలుపుకుంటూ వచ్చాం. మన దేశ చరిత్రలో స్వాతంత్య్రం కోసం చేసిన యుద్ధాలు, సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. అనేక సంఘర్షణల మధ్య కూడా భారతదేశం తన అస్తిత్వాన్ని, చరిత్రను కాపాడుకుంటూ వచ్చింది. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ మరచిపోకూడదు. ఏ జాతికి తన గత చరిత్ర గురించిన వాస్తవికమైన జ్ఞానం ఉండదో ఆ జాతికి భవిష్యత్తు కూడా ఉండదు. ఈ సత్యంతోపాటు మరో సత్యం కూడా ఉంది. తమ గౌరవపూర్వమైన చరిత్ర జ్ఞానం, గౌరవం ఉంటే కూడా సరిపోదు. భవిష్యత్తును తీర్చిదిద్దు కోవడంలో చరిత్రను ఉపయోగించుకునే క్షమతను సంపాదించుకోవడం కూడా చాలా అవసరం. అప్పుడే చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోగలం.
– స్వాతంత్య్రవీర సావర్కర్