ఈ భారత భూమి తనదని భావించే ప్రతి వ్యక్తి హిందువే..
ఈ భారత భూమి తనదని, తన పితృభూమి అని, తన ధర్మానికి పుట్టినిల్లైన పవిత్ర భూమి అని భావించే ప్రతి వ్యక్తి హిందువే. అదే క్రమంలో, ఆదివాసీలుగా పిలువబడుతున్న వారు కూడా హిందువులే. ఎందుకంటే వారు ఏ ధర్మాన్ని పాటించినా.. లేదా ఏవిధంగా ఆరాధన చేసినా, భారత దేశం వారి పితృభూమి మరియు పవిత్ర భూమి. దేశంలో నివసించే ప్రతి వ్యక్తి ప్రాంతం, భాష, మతాలకు అతీతంగా తాను భారతీయుడినని భావించాలి. అదే మన జాతీయత. హిందుత్వం అనేది మన జాతీయతను సూచిస్తుంది. జాతీయత అనే నదిలో అన్ని మతాలు, వర్గాలు సెల యేర్లలా కలిసిపోవాలి.
-వీర సావర్కర్