హిజాబ్‌ ‌ముసుగులో జిహాదీల అరాచకాలు – వి.హెచ్‌.‌పి

కర్నాటకలోని ఉడిపిలో మొదలైన హిజాబ్‌ ‌వివాదం వాస్తవానికి హిజాబ్‌ ‌ముసుగులో జిహాదీ అరాచకాలను వ్యాప్తి చేయడానికి ఒక ఎత్తుగడ, ఎజెండా అని విశ్వ హిందూ పరిషత్‌ (‌వి.హెచ్‌.‌పి) పేర్కొంది. వీహెచ్‌పీ కేంద్ర జాయింట్‌ ‌జనరల్‌ ‌సెక్రటరీ డాక్టర్‌ ‌సురేంద్ర జైన్‌ ‌దీనిని ‘హిజాబ్‌ ‌జిహాద్‌’ అని మాత్రమే పిలవాలని అన్నారు. ఉడిపిలోని ఒక పాఠశాలలో, పాఠశాల యూనిఫాం ధరించకూడదని 6 మంది విద్యార్థినులు వికృతంగా రూల్స్‌కు విరుద్ధంగా పట్టుబట్టడం ఫ్లాష్‌ ‌పాయింట్‌గా మారింది. మొత్తం కర్నాటకలో అల్లకల్లోలం సృష్టించేందుకు పీఎఫ్‌ఐ ‌వంటి జిహాదీ సంస్థలు పెద్ద కుట్ర పన్నుతున్నాయి. బాగల్‌కోట్‌ ‌వంటి పలు ప్రాంతాల్లో జిహాదీలు జరిపిన రాళ్లదాడి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. దేశంలోని అప్రమత్తమైన, జాగరూకమైన హిందూ సమాజ పౌరులు ఈ ఎజెండాను అమలుజరపడం సాగనివ్వరు.

ఇస్లామిక్‌ ‌ప్రపంచం, మొత్తం ప్రపంచంలోని టూల్‌కిట్‌ ‌గ్యాంగ్‌లు దీనిపై స్పందించిన వేగం చూస్తుంటే, భారత్‌లో అరాచకం, గందరగోళం సృష్టించడానికి ఎలాంటిదైనా ప్రతి ఒక్క అవకాశాన్నీ ఉపయోగించుకోవాలని వారు కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలియజేస్తుందని ఆయన అన్నారు. బహుశా వారు కర్ణాటకలో షాహీన్‌బాగ్‌ను పునరావృతం చేయాలనుకుంటున్నారు. కర్నాటక ప్రభుత్వం నిఘా  భారతదేశ జాతీయవాద సమాజ శాశ్వతమైన అప్రమత్తత కారణంగా వారి జిహాదీ ఎత్తులు, ఎజెండాలో వారు విజయం సాధించలేరని వి.హెచ్‌.‌పి, ఈ వికృత, గందరగోళ మూకలకు స్పష్టం చేస్తోంది. ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పరోక్ష మద్దతు ఇవ్వడం వల్లనే వారు ఢిల్లీ పౌరులను ఇబ్బంది పెట్టగలిగారు.

డా. జైన్‌ ‌మాట్లాడుతూ, ఈ కుట్రలో పావులుగా తమకు తాము ఒప్పుకున్న ఉడిపికి చెందిన బాలికలు, పాఠశాలలో అడ్మిషన్‌ ‌పొందే సమయంలో, స్కూల్‌ ‌యూనిఫాం వేసుకుని క్లాస్‌కి వస్తామని స్పష్టంగా రాసిన ఫారమ్‌పై, దృఢ నిశ్చయంతో తమ సంతకాలు పెట్టారని చెప్పారు. విద్యార్థులు నియమాలు మరియు మార్గదర్శకాలను అనుసరిస్తే మాత్రమే విద్యను అందించడం, నేర్పించడం, అవగాహన చేసుకోవడం కోసం పాఠశాలలో స్నేహపూర్వక వాతావరణం సృష్టించబడుతుంది. మొదట్లో ఈ విద్యార్థినులు యూనిఫాం ధరించి పాఠశాలకు వచ్చేవారు. హఠాత్తుగా ఈ హిజాబ్‌ ‌ధరించే దురభిమానం దూకుడుగా వ్యవహరించిన తీరు చూస్తే, ఇది ఘజ్వా-ఎ-హింద్‌ ‌జిహాదీ పథకం, ఎజెండాలో భాగమేనని స్పష్టమవుతుంది. దీనిని సమర్ధించడమే కాకుండా, కాంగ్రెస్‌ ‌పార్టీ సూత్రధారిగా ఉన్న టూల్‌కిట్‌ ‌గ్యాంగ్‌ ‌హిందూ సమాజాన్ని అవమాన పరిచిన తీరు ఆమోదయోగ్యం కాదు, అత్యంత ఖండించదగినది.

కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని మొత్తం టూల్‌కిట్‌ ‌ముఠాలు, జిహాదీ శక్తులు దేశంలో అధర్మాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నది దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అప్రమత్తమైన హిందూ సమాజం వారి ఈ అపవిత్ర కుట్రలను తప్పకుండా తిప్పికొడుతుందని వీహెచ్‌పీ వారికి స్పష్టం చేస్తోంద న్నారు. కర్నాటక ప్రభుత్వం ఈ కుట్ర లన్నింటిని బయటపెట్టి, ఈ జిహాదీ మంటలను దేశమంతటా వ్యాపింపజేసే దమ్ము ధైర్యం వారికి లేకుండా చేయడానికి చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించా లని వి.హెచ్‌.‌పి విజ్ఞప్తి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *