కిలిమంజారోపై భారీ మువ్వన్నెల పతాక..

మరో నాలుగు రోజుల్లో జరగనున్న భారత 78వ స్వాతంత్య్రదిన వేడుకల నేపథ్యంలో ఆఫ్రికా ఖండంలోని ఎత్తయిన పర్వతమైన కిలిమంజారోపై గల ఉహూరు శిఖరంపై 7,800 చదరపు అడుగుల భారీ మువ్వన్నెల పతాక అలరించింది. శనివారం ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన రక్షణ మంత్రిత్వశాఖ.. ‘దివ్యాంగులు’, నిరుపేద యువత తమ కలలను సాకారం చేసుకునే దిశగా స్ఫూర్తి కలిగించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొంది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని హిమాలయన్‌ మౌంటనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (హెచ్‌ఎంఐ)కు చెందిన దివ్యాంగ యాత్రా బృందం ఈ సాహస కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. కెప్టెన్‌ జైకిషన్‌ జట్టుకు సారథ్యం వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *